CBSE inspection: ఢిల్లీ, రాజస్థాన్‌లోని 27 పాఠశాలల్లో సీబీఎస్ఈ తనిఖీలు.. నకీలీ స్కూళ్లే టార్గెట్

ఢిల్లీ, రాజస్థాన్‌లోని 27 పాఠశాలల్లో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ గురువారం ఆకస్మిక తనిఖీలు చేపట్టింది.

Update: 2024-09-05 15:25 GMT

దిశ, నేషనల్ బ్యూరో: ఢిల్లీ, రాజస్థాన్‌లోని 27 పాఠశాలల్లో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) అధికారులు గురువారం ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. బోర్డు నిబంధనలకు విరుద్ధంగా పలు పాఠశాలలు పనిచేస్తున్నాయని సీబీఎస్ఈకి కంప్లెంట్స్ రావడంతో ఈ చర్యలు తీసుకున్నట్టు తెలిపారు. సోదాల్లో భాగంగా పలు స్కూళ్లు చేర్చుకోవాల్సిన విద్యార్థుల సంఖ్య కంటే అధికంగా స్కూడెంట్స్‌ను జాయిన్ చేసుకున్నట్టు గుర్తించారు. అలాగే సీబీఎస్ఈ గుర్తింపు పొందని పాఠశాలలు సైతం నడుస్తున్నట్టు వెల్లడైంది. మౌలిక సదుపాయాల విషయంలో రూల్స్ మొత్తం ఉల్లంఘించి వ్యవహరిస్తున్నట్టు తెలుస్తోంది. సోదాల్లో భాగంగా గుర్తించిన అంశాలపై సమీక్షించి ఆయా స్కూళ్లపై చర్యలు తీసుకోనున్నట్టు అధికారులు వెల్లడించారు. తీవ్రమైన ఉల్లంఘనలకు పాల్పడిన పాఠశాలలకు షోకాజ్ నోటీసులు జారీ చేయడంతో పాటు, చట్టపరమైన చర్యలు తీసుకోనున్నట్టు సమాచారం. 


Similar News