అరుదైన మైలురాయిని చేరుకున్న INS Vikrant

భారత నూతన విమాన వాహన నౌక ఐఎన్ఎస్ విక్రాంత్ అరుదైన మైలురాయిని చేరుకుంది. వాహన నౌకపై తొలి విమానం ల్యాండ్ అయింది.

Update: 2023-02-06 16:50 GMT

ముంబై: భారత నూతన విమాన వాహన నౌక ఐఎన్ఎస్ విక్రాంత్ అరుదైన మైలురాయిని చేరుకుంది. వాహన నౌకపై తొలి విమానం ల్యాండ్ అయింది. తేలిక పాటి యుద్ధ విమానమైన తేజస్ సముద్ర ట్రయల్స్‌లో భాగంగా ఐఎన్ఎన్ విక్రాంత్‌పై ల్యాండ్ అయినట్లు నావీ అధికారులు తెలిపారు. ఈ మేరకు సోమవారం ప్రకటన విడుదల చేశారు.

'ఆత్మనిర్భర్ భారత్‌లో భాగంగా భారత నావీ చారిత్రాత్మక మైలు రాయిని అందుకుంది. ఐఎన్ఎస్ విక్రాంత్‌పై తొలి యుద్ధవిమానం ల్యాండ్ అయింది. ఇది స్వదేశీ యుద్ధ విమానంతో స్వదేశీ విమాన వాహక నౌకను రూపొందించడం, అభివృద్ధి చేయడం, నిర్మాణం, నిర్వహణ వంటి భారతదేశ సామర్థ్యాన్ని ప్రదర్శిస్తుంది' అని ప్రకటనలో పేర్కొంది.

రూ. 20 వేల కోట్లతో నిర్మించిన ఐఎన్ఎస్ విక్రాంత్ గత ఏడాది సెప్టెంబర్ లో జలప్రవేశం చేసింది. ఇది 30 ఎయిర్ క్రాఫ్ట్, హెలికాప్టర్లను నిర్వహించే సామర్థ్యాన్ని కలిగి ఉంది.

Tags:    

Similar News