నేటి నుంచి అమల్లోకి సీఏఏ.. ఎన్నికల వేళ మోడీ సర్కార్ మరో సంచలన నిర్ణయం
రాబోయే లోక్ సభ ఎన్నికల ముంగిట్లో కేంద్ర ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది.
దిశ, డైనమిక్ బ్యూరో:రాబోయే లోక్ సభ ఎన్నికల ముంగిట్లో కేంద్ర ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. పౌరసత్వ సవరణ చట్టం -2019 (సీఏఏ) అమల్లోకి తీసుకువచ్చింది. నేటి నుంచే సీఏఏ అమల్లోకి రాబోతునన్నదంటూ కేంద్ర హోంశాఖ సోమవారం గెజిట్ విడుదల చేసింది. ఈ మేరకు పౌరసత్వ సవరణ చట్టం నిబంధనలను వెల్లడించింది. ఎన్నికల షెడ్యూల్ కంటే ముందే సీఏఏ అమలు చేస్తామని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సహా పలువురు కేంద్ర మంత్రులు ఇటివల వ్యాఖ్యానించారు. వారు చెప్పినట్లుగానే షెడ్యూల్ కంటే ముందే సీఏఏ అమలు చేస్తూ కేంద్రం నోటిఫికేషన్ జారీ చేసింది.
కాగా 2019 డిసెంబర్ 11న పార్లమెంట్ లో సీఏఏ చట్టానికి ఆమోదం తెలిపింది. దీనికి రాష్ట్రపతి సమ్మతి కూడా లభించింది. కానీ దీనికి సంబంధించిన నిబంధనలు రూపొందించకపోడంతో చట్టం అమలల్లోకి రాలేకపోయింది. తాజాగా పౌరసత్వ సవరణ చట్టం నిబంధనలను వెల్లడించడంతో నాలుగేళఅల తర్వాత చట్టం వాస్తవరూపంలోకి వచ్చినట్లైంది. అఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, పాకిస్తాన్ లో హింసకు గురై 2014 కంటే ముందు భారత్ కు వచ్చిన హిందువులు, క్రైస్తవులు, సిక్కులు, జైనులు, బౌద్దులు, పార్శీలకు పౌరసత్వం కల్పించేలా సీఏఏ చట్టాని రూపొందించింది. అయితే ఈ చట్టంలో ముస్లింను చేర్చకపోవడంపై కేంద్రంపై విమర్శలు వ్యక్తం అయ్యాయి.