Ayodya: అయోధ్యలో బాలరాముడి విగ్రహ నుదురుపై సూర్య తిలకం.. కనువిందు చేసిన దృశ్యాలు
దేశ వ్యాప్తంగా శ్రీరామ నవమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్య రామమందిరంలోనూ ఉత్సవాలు అంగరంగ వైభంగా జరిగాయి.

దిశ, నేషనల్ బ్యూరో: దేశ వ్యాప్తంగా శ్రీరామ నవమి (Srirama Navami) వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఉత్తరప్రదేశ్ (Uthara Pradesh) లోని అయోధ్య రామమందిరం (Ayodhya Ram temple) లోనూ ఉత్సవాలు అంగరంగ వైభంగా జరిగాయి. ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు రామ్ లల్లా నుదుటిపై సూర్య తిలకం వేశారు. సూర్యకాంతి స్పష్టంగా రామ్ లల్లా విగ్రహం నుదిటిపైకి ప్రసరించి, దివ్య తిలకం ఏర్పడింది. దాదాపు 4 నిమిషాల పాటు సూర్యకిరణాలు రామ్‌లల్లాపై పడ్డాయి. ఈ దృశ్యాలు ఎంతగానో కనువిందు చేశాయి. ఈ క్షణాన్ని తిలకించడానికి దేశ విదేశాల నుంచి అనేక మంది భక్తులు తరలివచ్చారు. అయోధ్య రామాలయంలో భక్తులు భారీగా గుమిగూడారు. సందర్శకుల రాకతో సరయూ నది వద్ద సందడి నెలకొంది. రామాలయాన్ని సందర్శించేముందు భక్తులు నదిలో పవిత్ర స్నానం చేశారు. సాయంత్రం సరయు ఘాట్‌లో దీపోత్సవం నిర్వహించారు.