BREAKING : ఎల్‌కే అద్వానీకి అస్వస్థత

బీజేపీ నేత, మాజీ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ ఎల్ కే అద్వానీ అస్వస్థతకు గురయ్యారు.

Update: 2024-06-27 02:33 GMT

దిశ, వెబ్‌డెస్క్: బీజేపీ నేత, మాజీ ఉప ప్రధాని ఎల్‌కే అద్వానీ అస్వస్థతకు గురయ్యారు. కాగా, ఆయనను బుధవారం అర్ధరాత్రి ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చేర్చారు. అయితే ప్రస్తుతం అద్వానీ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. 96 ఏళ్ల అద్వానీ యూరాలజీ వైద్యుల పర్యవేక్షణలో ఉన్నట్లు తెలిసింది. అయితే, మార్చి 30, 2024న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము భారతరత్నతో సత్కరించారు. కరాచీలో 1927 నవంబర్ 8న అద్వానీ జన్మించారు. 1942లో ఆర్ఎస్ఎస్ లో ఆయన చేరారు. 1986 నుంచి 1990, 1993 నుంచి 1998, 2004 నుంచి 2005 వరకు బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా అద్వానీ పనిచేశారు. 1999-2004లో వాజ్ పేయి సర్కారులో ఉప ప్రధానిగా పనిచేశారు. మూడు దశాబ్ధాలుగా ఎంపీగా కొనసాగిన ఆయన తొలుత హోమ్ మినిస్టర్‌గా పనిచేశారు.   


Similar News