BREAKING: కర్ణాటకను ముంచెత్తుతోన్న భారీ వర్షాలు.. కుప్పకూలిన కాళీ రివర్ బ్రిడ్జి

పొరుగు రాష్ట్రం కర్ణాటకలో వర్షాలు ఎడతెరిపి లేకుండా కురుస్తున్నాయి.

Update: 2024-08-07 06:04 GMT

దిశ, వెబ్‌డెస్క్: పొరుగు రాష్ట్రం కర్ణాటకలో వర్షాలు ఎడతెరిపి లేకుండా కురుస్తున్నాయి. ఈ క్రమంలోనే కర్ణాటక, గోవా రాష్ట్రాలను కలుపుతూ.. కాళీ నదిపై నిర్మించిన వంతెన బుధవారం తెల్లవారుజామున కుప్పకూలింది. అర్ధరాత్రి 1.30 గంటల సమయంలో బ్రిడ్జిపై నుంచి హెవీ లోడ్‌తో లారీ వెళ్లగా వంతెన ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ప్రమాదంలో లారీ నదిలో పడిపోగా తమిళనాడుకు చెందిన డ్రైవర్ బాలమురుగన్ లారీ క్యాబిన్‌పై నిలబడి సాయం కోసం కేకలు పెట్టాడు. దీంతో సమయానికి అక్కడే ఉన్న మత్స్యకారులు డ్రైవర్‌ను చాకచక్యంగా రక్షించారు. అనంతరం తీవ్ర గాయాలైన అతడిని ఆసుపత్రికి తరలించేందుకు సహాయక సిబ్బందికి సమాచారం అందించారు. కాగా, గోవా, కర్ణాటక రాష్ట్రాలను కలిపేందుకు 1980లో 66వ జాతీయ రహదారిపై కాళీ వంతెనను నిర్మించారు. అయితే, ఉత్తర కన్నడ డిప్యూటీ కమిషనర్ ఆదేశాలతో ప్రస్తుతం కొత్త వంతెనపై రాకపోకలు నిలిపివేశారు. ఆగస్టు 7న మధ్యాహ్నం 12 గంటలలోగా కొత్త వంతెనను పరిశీలించి, దాని స్థిరత్వానికి సంబంధించిన నివేదికను సమర్పించాలని డిప్యూటీ కమిషనర్ నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియాను ఆదేశించారు.

Tags:    

Similar News