Bomb Threats: స్కూళ్లకు బాంబు బెదిరింపులు.. రంగంలోకి దిగిన బాంబ్ స్వ్కాడ్

దేశ రాజధాని ఢిల్లీ (Delhi)లో ఇటీవల జరిగిన పేలుడు ఘటన మరువక ముందే ఇవాళ ఉదయం పలు పాఠశాలలకు (Delhi School) బాంబు బెదిరింపులు (Bomb Threats) రావడం కలకలం సృష్టిస్తోంది.

Update: 2024-12-09 02:34 GMT

దిశ, వెబ్‌డెస్క్: దేశ రాజధాని ఢిల్లీ (Delhi)లో ఇటీవల జరిగిన పేలుడు ఘటన మరువక ముందే ఇవాళ ఉదయం పలు పాఠశాలలకు (Delhi School) బాంబు బెదిరింపులు (Bomb Threats) రావడం కలకలం సృష్టిస్తోంది. తాజాగా, ఆర్కేపురం (RK Puram) పరిధిలోని రెండు ప్రైవేటు పాఠశాలలకు ఆగంతకులు ఈ మెయిల్ (e-mail) ద్వారా బాంబు బెదిరింపులు మెసేజ్‌లు పంపారు. వెంటనే అప్రమత్తమైన పాఠశాల యాజమాన్యం పోలీసులకు సమాచారం అందజేశారు. ఫైర్ అధికారులు, పోలీసులు (Police), బాంబ్ స్వ్కాడ్ (Bomb Squad) ఘటనా స్థలానికి చేరుకుని పాఠశాల ప్రాంగణంలో విస్తృతంగా తనిఖీలు చేపడుతున్నారు. అయితే, ఈ తనిఖీల్లో ఎలాంటి పేలుడు పదార్థాలు, అనుమానాస్పద వస్తువులు లభించలేదు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఈ మెయిల్ ఎవరు పంపారనే విషయంపై ఆరా తీస్తున్నారు.

కాగా, ఢిల్లీ ప్రశాంత్‌ విహార్‌ (Prashanth Vihaar)లోని పీవీఆర్‌ మల్టీఫ్లెక్స్‌ (PVR Multiplex)‌కు సమీపంలో ఇటీవలే బాంబు పేలుడు కలకలం సృష్టించింది. దీంతో స్థానికులు, మల్టీఫ్లెక్స్‌కు వచ్చిన ప్రజలు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఈ ఘటనలో ఓ ఆటో డ్రైవర్‌కు స్వల్ప గాయాలయ్యాయని ఢిల్లీ పోలీసులు (Delhi Police) వెల్లడించారు. ఘటనా స్థలం నుంచి తెల్లటి పౌడర్‌ లభ్యమైందని, మరిన్ని వివరాల కోసం దర్యాప్తు చేపట్టామని పేర్కొన్నారు. అదేవిధంగా ప్రశాంత్‌ విహార్‌ (Prashanth Vihaar)లోని ఇదే ప్రాంతంలో అక్టోబర్‌ 20న సీఆర్‌పీఎఫ్‌ (CRPF) స్కూల్‌ గోడను ఆనుకుని పేలుడు సంభవించిన ఘటన అందరికీ విదితమే.

Tags:    

Similar News