Delhi: అసెంబ్లీ ఎన్నికల ముందు ఆప్ కి బిగ్ షాక్

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ముందు ఆమ్ ఆద్మీ పార్టీ(AAP)కి భారీ షాక్ తగిలింది. ఆప్ కి చెందిన ఐదుగురు కౌన్సిలర్లు కాషాయ కండువా కప్పుకున్నారు.

Update: 2024-08-25 13:37 GMT

దిశ, నేషనల్ బ్యూరో: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ముందు ఆమ్ ఆద్మీ పార్టీ(AAP)కి భారీ షాక్ తగిలింది. ఆప్ కి చెందిన ఐదుగురు కౌన్సిలర్లు కాషాయ కండువా కప్పుకున్నారు. బీజేపీ అగ్ర నేతలు రాంవీర్ సింగ్ బిధూరి, అరవిందర్ సింగ్ లవ్లీ, యోగేంద్ర చందోలియా సమక్షంలో బీజేపీలో చేరారు. వీరితో పాటు భారీ సంఖ్యలో ఆప్ కార్యకర్తలు కమలం పార్టీలో చేరారు. బవానాలోని షహబాద్ డెయిరీ (వార్డ్ నంబర్ 28) నుండి రామ్ చంద్ర, బవానాలోని వార్డు నంబర్ 30 నుండి పవన్ సెహ్రావత్, బదర్‌పూర్ వార్డు నంబర్ 180 నుండి మంజు నిర్మల్, వార్డు నంబర్ 178 నుండి సుగంధ బిధురి, తుగ్లకాబాద్, హర్కేష్ నగర్‌లోని వార్డు నంబర్ 177కు ప్రాతినిధ్యం వహిస్తున్న మమత పవన్ బీజేపీలో చేరారు.

స్పందించిన బీజేపీ ఢిల్లీ చీఫ్

ఆప్ కౌన్సిలర్లు బీజేపీలో చేరడంపై బీజేపీ ఢిల్లీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్‌దేవ్ స్పందించారు. అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని పార్టీ పనితీరుపై అసంతృప్తితో ఉన్న నేతలు బీజేపీలో చేరారని పేర్కొన్నారు. ప్రధాని మోడీ పనితీరు నుంచి స్ఫూర్తి పొందారని.. ఢిల్లీ అభివృద్ధికి ఆప్ సృష్టిస్తున్న అడ్డంగులపై వారంతా విసిగిపోయారని అన్నారు. ఇకపోతే, 2020 ఎన్నికల్లో 70 అసెంబ్లీ స్థానాలకు గానూ ఆప్ 62 స్థానాల్లో గెలిచింది. బీజేపీ కేవలం 8 స్థానాల్లో మాత్రమే విజయం సాధించింది. మరోవైపు, 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఢిల్లీలోని 8 ఎంపీ సీట్లలో ఆప్ ఒక్కదాంట్లోనూ విజయం సాధించలేదు.


Similar News