Priyanka Gandhi: డబుల్ ఇంజిన్ సర్కారు పాలనలో డబుల్ దౌర్జన్యాలు- ప్రియాంక గాంధీ

బిహార్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (BPSC) ఇటీవల నిర్వహించిన ప్రిలిమినరీ పరీక్షల్లో అవకతవకలు జరిగాయన్న వ్యవహారం తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది.

Update: 2024-12-30 11:32 GMT
Priyanka Gandhi: డబుల్ ఇంజిన్ సర్కారు పాలనలో డబుల్ దౌర్జన్యాలు- ప్రియాంక గాంధీ
  • whatsapp icon

దిశ, నేషనల్ బ్యూరో: బిహార్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (BPSC) ఇటీవల నిర్వహించిన ప్రిలిమినరీ పరీక్షల్లో అవకతవకలు జరిగాయన్న వ్యవహారం తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. పాట్నాలోని గాంధీ మైదాన్‌ వద్ద ఆందోళన చేపట్టిన విద్యార్థులపై పోలీసులు లాఠీఛార్జి చేయడాన్ని కాంగ్రెస్‌ ఎంపీ ప్రియాంకా గాంధీ(Priyanka Gandhi) తీవ్రంగా ఖండించింది. “డబుల్ ఇంజిన్‌ సర్కార్ పాలనలో యువతపై డబుల్ దౌర్జన్యాలు కొనసాగుతున్నాయి. ఈ చలిలో విద్యార్థులపై వాటర్ కెనాన్లు వాడటం, లాఠీఛార్జ్ చేయడం దారుణం. బిహార్‌లో మూడు రోజుల వ్యవధిలో ప్రభుత్వం రెండు సార్లు స్టూడెంట్స్ పై దాడులకు దిగింది. పరీక్షల్లో అవినీతి, రిగ్గింగ్‌లు, పేపర్ లీక్‌లను అరికట్టడం తమ బాధ్యత అనే విషయం నితీష్ ప్రభుత్వం మరిచిపోయింది. తమకు జరిగిన అన్యాయానికి వ్యతిరేకంగా అభ్యర్థులు పోరాడుతుంటే సహించలేక వారిని అణచివేయడానికి ఈ డబుల్ ఇంజిన్ సర్కార్ యత్నిస్తుంది” అని ప్రియాంక మండిపడ్డారు.

బిహార్ ప్రభుత్వంపై విమర్శలు

ఇక, బిహార్‌ మాజీ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్‌ కూడా పోలీసుల తీరుని తప్పుబట్టారు. విద్యార్థులపై పోలీసులు లాఠీఛార్జ్ ని చేయడం బాధాకరమన్నారని వెల్లడించారు. ఈ ఘటనలో చాలా మంది గాయపడ్డారని అన్నారు. సోషల్ మీడియాలో లాఠీఛార్జ్ వీడియోలను చూస్తుంటే వారెంత బాధను అనుభవించారో తెలుస్తుందన్నారు. మరోవైపు, ఆప్ రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్ బిహార్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ఇది నిరంకుశ ప్రభుత్వ నియంతృత్వానికి ఉదాహరణగా పేర్కొన్నారు. అన్యాయానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న యువతతో పోలీసులు దారుణంగా ప్రవర్తించారని ఫైర్ అయ్యారు. విద్యార్థిగా ఎన్నో ఉద్యమాలు చేసి.. ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగిన నీతీశ్‌ కుమార్‌ సర్కార్ నుంచి ఇలాంటి ఘటనలు ఊహించలేదని చెప్పుకొచ్చారు.


Read More..

Taliban Rule : మహిళలపై తాలిబన్ ప్రభుత్వం మరిన్ని క్రూరమైన ఆంక్షలు  

Tags:    

Similar News