హింసాత్మకంగా మారిన కాంగ్రెస్ నిరసనలు.. పోలీసులపై రాళ్లు గుడ్లు, టమాటాలు చెయిర్‌లతో దాడి
అసెంబ్లీ నుంచి 14 మంది ఎమ్మెల్యేలను సస్పెండ్ చేసినందుకు కాంగ్రెస్ పార్టీ ఈ రోజు భువనేశ్వర్లో చేపట్టిన నిరసనలు హింసాత్మకంగా మారాయి.

దిశ, వెబ్ డెస్క్: అసెంబ్లీ నుంచి 14 మంది ఎమ్మెల్యేలను సస్పెండ్ చేసినందుకు కాంగ్రెస్ పార్టీ (Congress party) ఈ రోజు భువనేశ్వర్లో (Bhubaneswar) చేపట్టిన నిరసనలు (protests) హింసాత్మకంగా (violently) మారాయి. ముందస్తు ప్లాన్ ప్రకారం.. పెద్దసంఖ్యలో వచ్చిన కాంగ్రెస్ కార్యకర్తలు (Congress workers) బ్యారికేడ్‌లను దాటేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసులు నిరసనకారులను అదుపు చేయడానికి ప్రయత్నించగా, కాంగ్రెస్ కార్యకర్తలు తమతో తెచ్చుకున్న రాళ్లు, గుడ్లు, టమాటాలతో పాటు, చెయిర్‌లను పోలీసులపైకి విసిరారు. దీంతో వారిని అదుపు చేసేందుకు.. పోలీసులు మొదట వాటర్ కానన్‌లను ఉపయోగించారు.
ఆ తర్వాత లాఠీ ఛార్జ్ (baton charge) చేసి నిరసనకారులను చెదరగొట్టారు. ఈ ఘర్షణలో కొంతమంది కాంగ్రెస్ కార్యకర్తలతో పాటు పోలీసు సిబ్బంది గాయపడ్డారు. ఈ సంఘటన లోయర్ పీఎంజీ ప్రాంతంలో జరిగింది. కాగా పెద్ద మొత్తంలో రోడ్లపైకి వచ్చిన కాంగ్రెస్ నేతలు పోలీసులపైకి చెయిర్‌లు, రాళ్లు విసరడంతో ఒక్కసారిగా ఆ ప్రాంతం మొత్తం రణరంగంగా మారిపోయింది. కాంగ్రెస్ నాయకులు ఈ పోలీసు చర్యను తీవ్రంగా ఖండించారు. అయితే పోలీసులు మాత్రం తమపై దాడి జరిగిన తర్వాతే ఈ చర్యలు తీసుకున్నట్లు పేర్కొన్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఆ వీడియోలో కాంగ్రెస్ కార్యకర్తలు పోలీసులపై చెయిర్ లతో దాడి చేయడం స్పష్టంగా కనిపించింది.