బీజేపీ తగిన మూల్యం చెల్లించుకుంటుంది: కాంగ్రెస్ నేత ప్రియాంకా గాంధీ
నిరుద్యోగం, అవినీతి, ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడంలో విఫలమైన బీజేపీ తగిన మూల్యం చెల్లించుకుంటుందని కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంకా గాంధీ ఆరోపించారు.
దిశ, నేషనల్ బ్యూరో: నిరుద్యోగం, అవినీతి, ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడంలో విఫలమైన బీజేపీ తగిన మూల్యం చెల్లించుకుంటుందని కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంకా గాంధీ ఆరోపించారు. హర్యానా పర్యటన ముగిసిన అనంతరం ఆమె గురువారం ఎక్స్‌లో పోస్టు చేశారు. ‘దేశంలోనే అత్యధిక నిరుద్యోగం హర్యానాలో ఉంది. ఫలితంగా రాష్ట్ర యువత ఎంతో ఇబ్బందులు పడుతున్నారు. దీనికి బీజేపీ తప్పకుండా మూల్యం చెల్లించుకుంటుంది’ అని పేర్కొన్నారు. బీజేపీ పాలనలో ప్రజలు విసిగి పోయారని, దేశంలో భారీ మార్పు తీసుకురాబోతున్నారని స్పష్టం చేశారు. హర్యానాలో కాంగ్రెస్ వేవ్ కొనసాగుతుందని తెలిపారు. రాష్ట్రంలోని అన్ని లోక్ సభ స్థానాల్లో కాంగ్రెస్ భారీ మెజారిటీతో గెలుస్తుందని దీమా వ్యక్తం చేశారు. ఈ విజయాన్ని ఎవరూ ఆపలేరని నొక్కి చెప్పారు. ప్రజలు కాంగ్రెస్ వైపే ఉన్నారని ఐదు దశల ఎన్నికల్లో ఈ విషయం స్పష్టంగా అర్థమైందని తెలిపారు. అంతకుముందు లోక్‌సభ ఎన్నికలకు పార్టీ అభ్యర్థి కుమారి సెల్జాకు మద్దతుగా రోడ్ షో నిర్వహించారు.