Rahul Gandhi: 'రాహుల్ గాంధీకి కర్ణాటక పోలీసుల షాక్'.. బీజేపీ అబద్దాలంటూ రాహుల్ మండిపాటు

ఓ వైపు అమెరికాలో తన వ్యాఖ్యలపై రాహుల్ గాంధీ రియాక్ట్ కాగా మరో వైపు ప్రతిపక్ష నాయకుడికి కర్నాటక పోలీసులు షాకిచ్చారు.

Update: 2024-09-21 11:39 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: సిక్కులను ఉద్దేశించి తాను చేసిన వ్యాఖ్యలపై లోక్ సభలో ప్రతిపక్ష నాయకుడు, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ రియాక్ట్ అయ్యారు. అమెరికా పర్యటనలో సిక్కులపై నేను చేసిన వ్యాఖ్యలపై బీజేపీ అసత్య ప్రచారం చేస్తోందని విమర్శించారు. శనివారం (ఎక్స్) ట్విట్టర్ వేదికగా స్పందించిన ఆయన.. నేను మాట్లాడిన దాంట్లో తప్పు ఏమైనా ఉందా? అని అడిగారు. ప్రతి సిక్కు, ప్రతి భారతీయుడు తమ మతాన్ని నిర్భయంగా ఆచరించే దేశం భారతదేశం కాకూడదా? అని ప్రశ్నించారు. బీజేపీ ఎప్పటిలాగా అబద్దాలను ప్రచారం చేస్తోందని నిజాన్ని సహించలేకే నా నోరు మూయించాలనుకుంటోందని ధ్వజమెత్తారు. కానీ భిన్నత్వం, సమాన్వతం, ప్రేమను పంచే విషయంలో దేశ విలువల కోసం నేను ఎప్పుడూ నా గొంతెత్తుతూనే ఉంటానన్నారు.

రాహుల్‌ గాంధీఫై ఎఫ్ఐఆర్:

ఇదిలా ఉంటే కర్ణాటకలో రాహుల్ గాంధీపై ఎఫ్ఐఆర్ నమోదు అయింది. అమెరికా పర్యటనలో భాగంగా రాహుల్ గాంధీ ఇటీవల ఓ వర్గానికి వ్యతిరేకంగా రాహుల్ గాంధీ వ్యాఖ్యలు చేశారంటూ కర్ణాటక బీజేపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో శనివారం బెంగళూరులోని హై గ్రౌండ్ పోలీస్ స్టేషన్ లో రాహుల్ గాంధీపై ఎఫ్ఐఆర్ నమోదైంది. 


Similar News