దాడులకు భయపడి పార్టీ ఆఫీసుల్లో తలదాచుకుంటున్న బీజేపీ శ్రేణులు!
పశ్చిమ బెంగాల్ లో బీజేపీ కార్యకర్తల ఇళ్లపై దాడులు కలకలం రేపుతున్నాయి.
దిశ, డైనమిక్ బ్యూరో: పశ్చిమ బెంగాల్ లో బీజేపీ కార్యకర్తల ఇళ్లపై దాడులు కలకలం రేపుతున్నాయి. సార్వత్రిక ఎన్నికలు ముగిసి ఫలితాలు కూడా వచ్చాయి కానీ కొన్ని రాష్ట్రాల్లో ఎన్నికల వేడి ఇంకా చల్లారలేదు. ప్రధాన పార్టీల కార్యకర్తలు ఒకరిపై మరొకరు దాడులు చేసుకుంటునే ఉన్నారు. ఈ నేపధ్యంలోనే బెంగాల్ లో తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలు రెచ్చిపోతున్నారు. ఎన్నికలు ముగిసిన నాటి నుంచి వారి ఆగడాలకు హద్దులు లేకుండా పోతున్నాయని బీజేపీ కార్యకర్తలు వాపోతున్నారు. బీజేపీ కార్యకర్తల ఇళ్లలోకి చొరబడి దాడులు చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
దాదాపు 10 వేళ మంది బీజేపీ కార్యకర్తలు వారి కుంటుంబసభ్యులను సురక్షిత ప్రాంతాలకు తరలించి కాపాడుకుంటున్నట్లు తెలిపారు. ఈ విషయంపై పార్టీ నేతలు గవర్నర్ కు ఫిర్యాదు చేశామని, అయినా చర్యలు తీసుకోవట్లేదని అంటున్నారు. దాడులకు భయపడి కొందరు బీజేపీ కార్యకర్తలు పార్టీ ఆఫీసుల్లో తలదాచుకుంటున్నట్లు తెలిపారు. కాగా ఈ ఎన్నికల్లో బీజేపీ 12 సీట్లు రాగా.. బెంగాల్ లో అధికారంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్ పార్టీ 29 సీట్లలో విజయం సాధించింది.