Himachal Pradesh: వరద ప్రభావిత ప్రాంతాల్లో జేపీ నడ్డా పర్యటన

బీజేపీ చీఫ్, కేంద్రమంత్రి జేపీ నడ్డా హిమాచల్ ప్రదేశ్ లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనున్నారు. రాంపూర్ లోని సమేజ్ ప్రాంతం వరదల వల్ల అధ్వానంగా మారింది. ఆ

Update: 2024-08-11 04:14 GMT

దిశ, నేషనల్ బ్యూరో: బీజేపీ చీఫ్, కేంద్రమంత్రి జేపీ నడ్డా హిమాచల్ ప్రదేశ్ లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనున్నారు. రాంపూర్ లోని సమేజ్ ప్రాంతం వరదల వల్ల అధ్వానంగా మారింది. ఆదివారం ఆ ప్రాంతాన్ని నడ్డా సందర్శించనున్నారు. భారీ వర్షం, ఆకస్మిక వరదలు హిమాచల్ ప్రదేశ్ ని చుట్టుముట్టాయి. దీంతో ఆస్తి, ప్రాణ నష్టం జరిగింది. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఇంకా సహాయకచర్యలు కొనసాగుతున్నాయి. వరదల్లో గల్లంతైన వారి సంఖ్య 52కి చేరిందని హిమాచల్ మంత్రి జగత్ సింగ్ నేగి పేర్కొన్నారు. వారి ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్నామన్నారు. మరోవైపు, ఈ నెల ప్రారంభంలోనే రాంపూర్ ప్రాంతాన్ని బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ సందర్సించారు. ప్రధాని, హోంమంత్రిత్వశాఖకు వరద నష్టంపై నివేదిక అందజేశారు.

రూ.900 కోట్ల నష్టం

హిమాచల్ ప్రదేశ్‌లో భారీ వర్షాలు, వరదల వల్ల రూ.900 కోట్ల నష్టం వాటిల్లిందన ప్రభుత్వం ఇటీవలే నష్టాన్ని అంచనా వేసింది. మరోవైపు, అన్ని జిల్లాల్లోనూ వర్షాలు కురుస్తాయని హెచ్చరికలు జారీ చేసింది. సెప్టెంబర్ వరకు అప్రమత్తంగా ఉండాలని కోరింది. రెస్క్యూ, సెర్చ్ ఆపరేషన్లు కొనసాగుతున్నాయి. అయితే, సాయం చేస్తానని కేంద్రం హామీ ఇచ్చినప్పిటకీ.. ఇప్పటివరకు ఎలాంటి సాయం అందలేదని హిమాచల్ సీఎం సుఖ్విందర్ సింగ్ సుఖ్ ఆందోళన వ్యక్తం చేశారు.


Similar News