ఖర్గేకు జేపీ నడ్డా లేఖ.. కాంగ్రెస్ నాయకత్వంపై ఘాటు విమర్శలు

ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే (AICC Kharge)కు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా (JP Nadda) లేఖ రాశారు. ఆ లేఖలో కాంగ్రెస్ నాయకత్వంపై ఘాటు విమర్శలు గుప్పించారు.

Update: 2024-11-22 03:58 GMT

దిశ, వెబ్ డెస్క్: ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే (AICC Kharge)కు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా (JP Nadda) లేఖ రాశారు. ఆ లేఖలో కాంగ్రెస్ నాయకత్వంపై ఘాటు విమర్శలు గుప్పించారు. మణిపూర్ అంశంపై కాంగ్రెస్ రాజకీయాలు చేస్తోందని ఆరోపించారు. విదేశీ శక్తులకు సహకరిస్తూ.. దేశ పురోగతిని కాంగ్రెస్ అడ్డుకుంటోందని దుయ్యబట్టారు నడ్డా.

"విదేశీ మిలిటెంట్ల అక్రమ వలసలను మీ ప్రభుత్వం చట్టబద్ధం చేయడమే కాకుండా, మాజీ హోంమంత్రిగా ఉన్న పి చిదంబరం వారితో ఒప్పందాలు కుదుర్చుకున్న సంగతి కూడా మీరు మరిచిపోయినట్లు కనిపిస్తోంది. కాంగ్రెస్ లాగా మా ప్రభుత్వం మణిపూర్ వంటి ఘటనను ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించదని నేను మీకు హామీ ఇస్తున్నాను. భారతదేశ పురోగతిని నిర్వీర్యం చేయాలని చూస్తున్న విదేశీ శక్తుల బంధాన్ని కాంగ్రెస్ నేతలు సమర్థిస్తూ, ప్రోత్సహిస్తున్న తీరు నిజంగా ఆందోళన కలిగిస్తోంది. అధికార దాహంతో ఉన్న కాంగ్రెస్.. ప్రజాస్వామ్యాన్ని పక్కదారి పట్టించే వ్యూహాలను పన్నుతోంది." అని నడ్డా లేఖలో ఆరోపించారు. ఈ లేఖపై ఖర్గే ఎలా స్పందిస్తారో చూడాలి. 

Tags:    

Similar News