Manish Sisodia: సుప్రీం కోర్టుని ఆశ్రయించిన సిసోడియా.. ఎందుకంటే?
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో బెయిల్ షరతులను సవరించాలని ఆప్ నేత మనీష్ సిసోడియా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
దిశ, నేషనల్ బ్యూరో: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో బెయిల్ షరతులను సవరించాలని ఆప్ నేత (AAP leader) మనీష్ సిసోడియా(Manish Sisodia) సుప్రీంకోర్టులో(Supreme Court) పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై సుప్రీంకోర్టు సీబీఐ (CBI), ఈడీల (ED) నుంచి సుప్రీంకోర్టు స్పందన కోరింది. ఇకపోతే, లిక్కర్ స్కాం(Delhi excise policy case) కేసులో బెయిల్ పై విడుదలైన సిసోడియా.. ప్రతి వారం రెండుసార్లు దర్యాప్తు అధికారి ముందు హాజరు కావాలి. అయితే, తన బెయిల్ షరతులలో సవరించాలని కోరారు. కాగా.. ఈ కేసుపై సుప్రీంకోర్టు క్లుప్త విచారణ చేపట్టింది. రెండు వారాల తర్వాత కేసు విచారణను షెడ్యూల్ చేసింది. జస్టిస్ బి.ఆర్.గవాయ్, కేవీ విశ్వనాథన్‌లతో కూడిన డివిజన్ బెంచ్.. ఈడీ, సీబీఐలకు నోటీసులు జారీ చేసింది. అంతేకాకుండా షరతులకు సంబంధించిన దానిపై త్వరలోనే స్పష్టత ఇస్తామని పేర్కొంది. సిసోడియా తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ వాదించారు.
ఢిల్లీ లిక్కర్ స్కాం
ఇకపోతే, మద్యం పాలసీ కేసుపై విచారణ ప్రారంభించడంలో జాప్యాన్ని దృష్టిలో ఉంచుకుని సీబీఐ, ఈడీ రెండు కేసుల్లో సిసోడియాకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. దాదాపు 17 నెలల తర్వాత ఆగస్టు 9న బెయిల్ పై సిసోడియా బయటకు వచ్చారు. అయితే, బెయిల్ షరతుల ప్రకారం, సిసోడియా ప్రతి సోమ, గురువారాల్లో ఉదయం 10 నుంచి 11 గంటల మధ్య విచారణ అధికారి ఎదుట సిసోడియా హాజరుకావాల్సి ఉంటుంది. కాగా.. ఇప్పటివరకు 60 సార్లు విచారణకు హాజరయ్యాయారని సిసోడియా తరఫు న్యాయవాది సుప్రీంకోర్టుకు తెలిపారు. దానికి సంబంధించి షరతులు సడలించాలని కోరారు. దీనిపైనే, సుప్రీం ధర్మాసనం విచారణ చేపట్టింది.