అనర్హత వేటును తృటిలో తప్పించుకున్న బీజేపీ ఎంపీ..

పార్లమెంట్ సభ్యత్వం కోల్పోయే ముప్పు నుంచి ఉత్తరప్రదేశ్‌లోని ఇటావాకు చెందిన బీజేపీ ఎంపీ రాంశంకర్ కతేరియా తృటిలో బయటపడ్డారు.

Update: 2023-08-07 16:15 GMT

లక్నో : పార్లమెంట్ సభ్యత్వం కోల్పోయే ముప్పు నుంచి ఉత్తరప్రదేశ్‌లోని ఇటావాకు చెందిన బీజేపీ ఎంపీ రాంశంకర్ కతేరియా తృటిలో బయటపడ్డారు. 2011లో ఆగ్రాలోని ప్రైవేట్ విద్యుత్ కంపెనీ టోరెంట్ విజిలెన్స్ ఆఫీసుకు వెళ్లి ఉద్యోగులపై దాడి చేశారనే అభియోగాలపై విచారణ జరిపిన ఆగ్రాలోని స్థానిక కోర్టు రెండు రోజుల క్రితమే(శనివారం) కతేరియాకు రెండేళ్ల జైలు శిక్ష విధించింది. రూ.50,000 జరిమానా కూడా విధించింది.

దీనిపై ఆగ్రా జిల్లా జడ్జి కోర్టులో అప్పీల్ చేయగా ఆయనకు ఉపశమనం లభించింది. దిగువ కోర్టు విధించిన రెండేళ్ల శిక్షను తదుపరి విచారణ వరకు నిలిపివేస్తున్నట్టు ఆగ్రా జిల్లా జడ్జి కోర్టు తెలిపింది. విచారణను సెప్టెంబర్ 11కు వాయిదా వేసింది. ఈ వార్త తెలియగానే కతేరియా మద్దతుదారులలో ఆనందం వెల్లివిరిసింది. ఒకవేళ శిక్షను కోర్టు కొనసాగించి ఉంటే.. రాంశంకర్ కతేరియా పార్లమెంట్ సభ్యత్వం రద్దై ఉండేది.


Similar News