బీజేపీ అగ్రనేత LK అద్వానీకి అస్వస్థత

బీజేపీ(BJP) అగ్రనేత ఎల్‌కే అద్వానీ(LK Advani) అస్వస్థతకు గురయ్యారు.

Update: 2024-12-14 04:17 GMT

దిశ, వెబ్‌డెస్క్: బీజేపీ(BJP) అగ్రనేత ఎల్‌కే అద్వానీ(LK Advani) అస్వస్థతకు గురయ్యారు. దీంతో శనివారం ఉదయం ఢిల్లీలోని అపోలో ఆసుపత్రి(Apollo Hospital)లో కుటుంబసభ్యులు చేర్పించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు సమాచారం. గత రెండు నెలల క్రితం కూడా ఆయన రెండు రోజుల పాటు దవాఖానలో వైద్యుల పరిశీలనలో ఉన్నారు. అంతకుముందు ఎయిమ్స్‌లోనూ ఆయన చికిత్స పొందారు. విషయం తెలిసిన బీజేపీ శ్రేణులు ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్థనలు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Tags:    

Similar News