Tejashwi Yadav : అసోం సీఎం ‘‘చైనీస్ వర్షన్‌’’.. తేజస్వి కామెంట్స్‌పై బీజేపీ భగ్గు

దిశ, నేషనల్ బ్యూరో : ‘‘అసోం సీఎం హిమంత బిస్వశర్మ.. యోగి ఆదిత్యనాథ్‌కు చైనీస్ వర్షన్ లాంటివారు’’ అంటూ ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ చేసిన విమర్శలపై బీజేపీ భగ్గుమంది.

Update: 2024-08-31 18:26 GMT

దిశ, నేషనల్ బ్యూరో : ‘‘అసోం సీఎం హిమంత బిస్వశర్మ.. యోగి ఆదిత్యనాథ్‌కు చైనీస్ వర్షన్ లాంటివారు’’ అంటూ ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ చేసిన విమర్శలపై బీజేపీ భగ్గుమంది. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ ఛైర్మన్ శ్యాం పిట్రోడాలాగే తేజస్వి యాదవ్ కూడా జాతివివక్షతో కూడిన వ్యాఖ్యలు చేశారని బీజేపీ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా ఆరోపించారు.

శ్యాం పిట్రోడా ఆలోచనా విధానంతో ప్రభావితం అయినందు వల్లే తేజస్వి నోట ఇలాంటి కామెంట్స్ వచ్చాయన్నారు. అసోం రాష్ట్రానికి చెందిన వ్యక్తి అయినందువల్లే సీఎం హిమంత బిస్వ శర్మకు చైనీస్ అనే ట్యాగ్‌ను తేజస్వి తగిలించారని షెహజాద్ పూనావాలా మండిపడ్డారు.


Similar News