బీజేపీ మూడో జాబితా.. 58 మంది అభ్యర్థుల ప్రకటన

Update: 2023-11-02 15:23 GMT

జైపూర్: రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల కోసం బీజేపీ 58 మంది అభ్యర్థులతో కూడిన మూడో జాబితాను గురువారం ప్రకటించింది. ఇందులో సీఎం అశోక్ గెహ్లాట్, మాజీ ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్‌పై పోటీకి అభ్యర్థులను ఖరారు చేసింది. సర్దార్‌పురా అసెంబ్లీ నియోజకవర్గంలో సీఎం అశోక్ గెహ్లాట్‌కు పోటీగా జోధ్‌పూర్ డెవలప్‌మెంట్ అథారిటీ మాజీ చైర్ పర్సన్ మహేంద్ర సింగ్ రాథోర్‌ను బరిలోకి దింపగా, సచిన్ పైలట్‌కు పోటీగా టోంక్‌ స్థానంలో మాజీ ఎమ్మెల్యే అజిత్ సింగ్‌ను పోటీలో ఉంచింది.

టోంక్ నుంచి 2013లో ఎమ్మెల్యేగా గెలిచిన అజిత్.. 2018లో పైలట్ చేతిలో ఓడిపోయారు. రాజస్థాన్‌లో 200 అసెంబ్లీ స్థానాలుండగా, మూడు దఫాల్లో కలిపి బీజేపీ ఇప్పటివరకు మొత్తం 182 మంది అభ్యర్థులను ప్రకటించింది. తొలి జాబితాలో 83 మంది, రెండో జాబితాలో 41 మందికి చోటుదక్కింది. ఇంకా 18 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. కాగా, రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలు ఈ నెల 25న జరగనుండగా, ఫలితాలు మిగతా 4 రాష్ట్రాలతో కలిపి వచ్చే నెల 3న వెలువడనున్న విషయం తెలిసిందే.

Tags:    

Similar News