Bihar: కులగణనతో జీవితాలు బాగుపడతాయా..? ప్రశాంత్ కిషోర్ కీలక వ్యాఖ్యలు

తెలంగాణ(Telangana), కర్ణాటక(Karnataka) రాష్ట్రాల్లో కులగణన(Caste Census)తో జీవితాలు బాగుపడతాయా? అని ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్(Prashant kishor) అన్నారు.

Update: 2024-11-06 12:01 GMT
Bihar: కులగణనతో జీవితాలు బాగుపడతాయా..? ప్రశాంత్ కిషోర్ కీలక వ్యాఖ్యలు
  • whatsapp icon

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ(Telangana), కర్ణాటక(Karnataka) రాష్ట్రాల్లో కులగణన(Caste Census)తో జీవితాలు బాగుపడతాయా? అని ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్(Prashant kishor) అన్నారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. కులగణనపై స్పందించారు. ఆ సందర్భంగా దేశాన్ని 65 ఏళ్ళపాటు ఏలిన కాంగ్రెస్(Congress) కులగణన ఎందుకు చేయలేదు అని రాహుల్ గాంధీ(Rahul Gandhi) ని ప్రశ్నించారు. సరే.. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న తెలంగాణా, కర్ణాటక రాష్ట్రాల్లో కులగణన చేస్తోంది కాదా.. దీనితో వాళ్ళ జీవితాలు బాగుపడతాయా చెప్పాలన్నారు. అసలు కులగణనతో పేదరికం పోతుందా అని, అలా ఐతే బీహార్(Bihar) లో జనగణన(People Census) ఎప్పుడో అయిపోందని, బీహార్ ధనిక రాష్ట్రంగా ఎందుకు మారలేదో చెప్పాలన్నారు. జనగణన సర్వే ద్వారా పేద ధనికుల వివరాలు మాత్రమే తెలుస్తాయని, పేదరికం దూరం చేయోచ్చనేది అవాస్తవమని ప్రశాంత్ కిషోర్ వ్యాఖ్యానించారు. కాగా ఎన్నికల వ్యూహకర్తగా ఉన్న ప్రశాంత్ కిషోర్ ఇటీవలే జన్ సురాజ్(Jan Suraj) అనే ఒక నూతన రాజకీయ పార్టీని స్థాపించారు. 

Tags:    

Similar News