Bihar CM Nitish Kumar: అది జోక్ మాత్రమే.. ఉపరాష్ట్రపతి కావాలనే వ్యాఖ్యలపై బీహార్ సీఎం క్లారిటీ..
Bihar CM Nitish Kumar Rejects Sushil Modi's Vice President Claims| తాను ఉపరాష్ట్రపతి కావాలని అనుకున్నారన్న బీజేపీ నేత సుశీల్ కుమార్ మోడీ వ్యాఖ్యలపై బీహార్ సీఎం నితీశ్ కుమార్ స్పందించారు. అది జోక్ మాత్రమేనని అన్నారు. ఈ మేరకు గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు
పాట్నా: Bihar CM Nitish Kumar Rejects Sushil Modi's Vice President Claims| తాను ఉపరాష్ట్రపతి కావాలని అనుకున్నారన్న బీజేపీ నేత సుశీల్ కుమార్ మోడీ వ్యాఖ్యలపై బీహార్ సీఎం నితీశ్ కుమార్ స్పందించారు. అది జోక్ మాత్రమేనని అన్నారు. ఈ మేరకు గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. తాము ఎన్డీఏ రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి అభ్యర్థులకు మద్దతు ఇచ్చామని పేర్కొన్నారు. తాను ఉపరాష్ట్రపతి కావాలనుకున్నారనే వ్యాఖ్యలు హస్యాస్పదమని అన్నారు. కాగా, జేడీయూ నేతలు నితీష్ కుమార్‌ను ఉపరాష్ట్రపతి చేయాలని తనను కలిసినట్లు బుధవారం సుశీల్ కుమార్ మోడీ ఆరోపించిన సంగతి తెలిసిందే. మరోవైపు జేడీయూ జాతీయ అధ్యక్షుడు రాజీవ్ రంజన్ లలన్ సింగ్ కూడా సుశీల్ వ్యాఖ్యలను ఖండించారు. బీజేపీతో తెగదెంపులు చేసుకుంటే నితీశ్ కుమార్ విపక్షాల రాష్ట్రపతి లేదా ఉపరాష్ట్రపతి అభ్యర్థి అవుతారని మీడియా ప్రచారం చేసినట్లు తెలిపారు. అయితే కావాలనే కట్టు కథలు చెబుతున్నారని బీజేపీని విమర్శించారు. కాగా, ఎన్డీఏ ప్రభుత్వానికి గుడ్ బై చెప్పిన నితీశ్ కుమార్ మహాఘట్ బంధన్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే.
ఇది కూడా చదవండి: మూఢనమ్మకాలతో ప్రధాన మంత్రి పదవిని దిగజార్చకండి