రష్యా సైన్యంలో ఉన్న భారతీయులకు ఊరట.. విడుదలకు ఓకే చెప్పిన పుతిన్

ఉక్రెయిన్ తో యుద్ధంలో పాల్గొంటున్న భారతీయులకు ఊరట లభించింది. ప్రధాని నరేంద్ర మోడీ రష్యా పర్యటన సందర్భంగా భారత్ కు దౌత్య విజయం దక్కింది.

Update: 2024-07-09 07:16 GMT

దిశ, నేషనల్ బ్యూరో: ఉక్రెయిన్ తో యుద్ధంలో పాల్గొంటున్న భారతీయులకు ఊరట లభించింది. ప్రధాని నరేంద్ర మోడీ రష్యా పర్యటన సందర్భంగా భారత్ కు దౌత్య విజయం దక్కింది. క్రెమ్లిన్ సైన్యంలో పనిచేస్తున్న భారతీయులను విడుదలచేసేందుకు రష్యా అధ్యక్షుడు పుతిన్ అంగీకరించారు. సైన్యంలో పనిచేస్తున్న భారత పౌరులను వెంటనే విధుల నుంచి వెనక్కి రప్పిస్తామని.. స్వదేశానికి పంపేందుకు ఏర్పాట్లు చేస్తామని పుతిన్ వెల్లడించారు. సోమవారం ప్రధాని మోడీ, పుతిన్ తో పాటుగా ప్రైవేటు విందులో పాల్గొన్నారు. ఈ క్రమంలో రష్యా సైన్యంలో భారతీయుల విషయాన్ని మోడీ ప్రస్తావించారు. అప్పుడే, ఈ విషయంపై మోడీకి పుతిన్ మాట ఇచ్చినట్లు సమాచారం.

ఉక్రెయిన్ యుద్ధంలో భారతీయులు

కాగా, ఉక్రెయిన్‌తో జరుగుతున్న యుద్ధంలో భారత యువకులను బలవంతంగా రష్యా తన సైన్యంలో చేర్చుకుంది. ఇప్పటికే, యుద్ధంలో ఇద్దరు భారతీయులు చనిపోయారు. తమను ఉద్యోగాల పేరుతో ఏజెంట్లు మోసం చేసి సైన్యంలో చేర్చారని పదుల సంఖ్యలో యువకులు ఆరోపిస్తున్నారు. తమను విడిపించి స్వదేశానికి తీసుకెళ్లాలని గతకొంతకాలంగా వాపోతున్నారు. వారి విడుదల కోసం మోడీ.. పుతిన్ ని అడగగా అందుకు ఒప్పుకున్నారు.


Similar News