కేజ్రీవాల్‌ను లెజెండ్స్‌తో పోల్చే ప్రయత్నం మానుకోవాలి: భగత్ సింగ్ మనవడు

ఢిల్లీ సీఎం భార్య సునీతా కేజ్రీవాల్ ఇటీవల వీడియో సందేశంలో మాట్లాడిన సందర్భంలో ఆమె వెనక గోడపై స్వాతంత్య్ర సమరయోధులు భగత్ సింగ్, అంబేద్కర్

Update: 2024-04-05 14:18 GMT

దిశ, నేషనల్ బ్యూరో: ఢిల్లీ సీఎం భార్య సునీతా కేజ్రీవాల్ ఇటీవల వీడియో సందేశంలో మాట్లాడిన సందర్భంలో ఆమె వెనక గోడపై స్వాతంత్య్ర సమరయోధులు భగత్ సింగ్, అంబేద్కర్ చిత్రాల మధ్య అరవింద్ కేజ్రీవాల్ జైల్లో ఉన్నట్లు చూపించే విధంగా ఉన్న ఫొటో ఉండటం ప్రస్తుతం తీవ్ర చర్చలకు దారితీసింది. తాజాగా దీనిపై భగత్ సింగ్ మనవడు యద్వీందర్ సంధు స్పందించారు. ''నేను ఈ రోజు ఉదయం సునీతా కేజ్రీవాల్ వీడియో చూశాను, అందులో అరవింద్ కేజ్రీవాల్ ఫొటోను భగత్ సింగ్, బాబా సాహెబ్ అంబేద్కర్‌తో పాటు గోడపై ఉంచారు. ఇది చూసిన తర్వాత నాకు భయంగా అనిపించింది. అతనిని లెజెండ్స్‌తో పోల్చే ప్రయత్నం జరిగింది, ఇలాంటి పనులను మానుకోవాలని ఆమ్ ఆద్మీ పార్టీని కోరుతున్నాను'' అని యద్వీందర్ సంధు అన్నారు.

గురువారం నాడు సునీతా కేజ్రీవాల్ ఢిల్లీ సీఎం సందేశాన్ని వీడియోలో వినిపిస్తున్న సమయంలో భగత్ సింగ్, అంబేద్కర్‌ ఫొటోల మధ్యలో జైలులో ఉన్నట్లుగా కనిపించే అరవింద్ కేజ్రీవాల్ ఫొటో కూడా కనబడింది. ఈ ఫొటోపై ఇప్పటికే బీజేపీ ఢిల్లీ విభాగం అధ్యక్షుడు వీరేంద్ర సచ్‌దేవ్ ఎక్స్ వేదికగా తీవ్రంగా విమర్శించారు. అవినీతిపరుడైన కేజ్రీవాల్ ఫొటోను స్వాతంత్య్ర సమరయోధుల మధ్య పెట్టడం విచారకరం అని అన్నారు. అలాగే, యద్వీందర్ సంధు మనోభావాలను సమర్థిస్తూ కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు కూడా ఈ చర్యను విమర్శించారు .


Similar News