దీపావళి పండుగ రోజు కన్నుమూసిన BPL ఫౌండర్ గోపాలన్ నంబియార్
గత కొంతకాలంగా అనారోగ్యంతో భాదపడుతున్న బీపీఎల్(BPL) గ్రూప్ ఛైర్మన్ టీపీ గోపాలన్ నంబియార్(Gopalan Nambiar ) దీపావళి పండుగ రోజు కన్నుమూశారు.
దిశ, వెబ్ డెస్క్: గత కొంతకాలంగా అనారోగ్యంతో భాదపడుతున్న బీపీఎల్(BPL) గ్రూప్ ఛైర్మన్ టీపీ గోపాలన్ నంబియార్(Gopalan Nambiar ) దీపావళి పండుగ రోజు కన్నుమూశారు. బెంగళూరులోని నివాసంలో గురువారం తుది శ్వాస విడిచినట్లు ఆయన అల్లుడు, బీజేపీ నేత, మాజీ కేంద్రమంత్రి రాజీవ్ చంద్రశేఖర్‌కు ట్విట్టర్ ద్వారా తెలిపారు. ఈ సందర్భంగా ఆ ట్వీట్ లో మాజీ మంత్రి ఇలా రాసుకొచ్చారు. దేశీయ కన్జూమర్ బ్రాండ్‌ను BPLను నెలకొల్పిన దార్శనికుడు టీపీ గోపాలన్ నంబియా మనకు దూరమయ్యాడని.. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని రాసుకొచ్చారు. గోపాలన్ మృతిపట్ల భారత ప్రధాని నరేంద్ర మోడీ సంతాపం తెలిపారు. 1990 సంవత్సరాల్లో ఎలక్ట్రానిక్ రంగంలో బీపీఎల్(BPL) సత్తా చాటింది. అనేక ఎలక్ట్రానిక్ వస్తువులను లోకల్ బ్రాండ్ గా గుర్తింపు తీసుకొచ్చింది. కానీ పెరుగుతున్న టెక్నాలజీలో భాగంగా అంతర్జాతీయ బ్రాండ్లు శాంసంగ్(samsung), ఎల్‌జీ(LG) ప్రవేశంతో బీపీఎల్(BPL) తన వైభవాన్ని కోల్పోయింది. గత కొంత కాలంగా గోపాలన్ నంబియార్ అనారోగ్యంతో ఉండటంతో ఆయన తనయుడు అజిత్ నంబియార్ బీపీఎల్‌కు ఛైర్మన్‌గా, సీఈఓగా వ్యవహరిస్తున్నారు.