MLA Passes away: కమలం పార్టీలో తీవ్ర విషాదం.. అనారోగ్యంతో సిట్టింగ్ ఎమ్మెల్యే కన్నుమూత

బీజేపీలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎర్త్ సైన్సెస్ మంత్రి జిత కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్‌ రాణా (Jitendra Singh Rana) సోదరుడు, బీజేపీ ఎమ్మెల్యే దేవేంద్ర సింగ్‌ రాణా (59) (Devendra Singh Rana) గురువారం రాత్రి తుది శ్వాస విడిచారు.

Update: 2024-11-01 04:29 GMT
MLA Passes away: కమలం పార్టీలో తీవ్ర విషాదం.. అనారోగ్యంతో   సిట్టింగ్ ఎమ్మెల్యే కన్నుమూత
  • whatsapp icon

దిశ, వెబ్‌డెస్క్: బీజేపీలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎర్త్ సైన్సెస్ మంత్రి జిత కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్‌ రాణా (Jitendra Singh Rana) సోదరుడు, బీజేపీ ఎమ్మెల్యే దేవేంద్ర సింగ్‌ రాణా (59) (Devendra Singh Rana) గురువారం రాత్రి తుది శ్వాస విడిచారు. కొన్నాళ్ల నుంచి ఆయన తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నట్లుగా సన్నిహితులు, కుటుంబ సభ్యులు తెలిపారు. దేవేంద్ర సింగ్ రాణా ఇటీవల జరిగిన జమ్ముకశ్మీర్‌ (Jammu Kashmir) అసెంబ్లీ ఎన్నికల్లో (Assembly Elections) నగ్రోటా (Nagrota) స్థానం నుంచి విజయకేతనం ఎగురవేశారు.

ఆయన నేషనల్‌ కాన్ఫరెన్స్‌ (National Conference) అభ్యర్ధి జోగిందర్‌ సింగ్‌ (Joginder Singh)పై 30,472 ఓట్ల తేడాతో విజయం సాధించారు. దేవేంద్ర సింగ్ మృతి పట్ల సీఎం ఒమర్ అబ్దుల్లా (CM Omar Abdullah), లెప్టినెంట్‌ గవర్నర్‌ మనోజ్‌ సిన్హా (Lieutenant Governor Manoj Sinha) ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు. అదేవిధంగా డిప్యూటీ సీఎం సురీందర్‌ కుమార్‌ చౌదరీ (Deputy CM Surinder Kumar Chowdary), దేవేంద్ర సింగ్ కుటుంబ సభ్యులను కలిసి వారికి ధైర్యం చెప్పారు. 

Tags:    

Similar News