పిడుగుల నుంచి విమానాలకు మెరుగైన రక్షణ.. ఎలా అంటే?
విమానంపై పిడుగులు విరుచుకుపడే విధానాన్ని కళ్లకు కట్టడానికి ప్రత్యేక కంప్యూటేషనల్ నమునాను రూపొందించారు.
దిశ, వెబ్‌డెస్క్: బెంగుళూరులోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ శాస్త్రవేత్తలు విమానంపై పిడుగులు విరుచుకుపడే విధానాన్ని కళ్లకు కట్టడానికి ప్రత్యేక కంప్యూటేషనల్ నమునాను రూపొందించారు. లోహ విహంగాల రక్షణకు మెరుగైన డిజైన్లను అభివృద్ధి చేయడానికి ఇది దోహదపడుతుందని సైంటిస్ట్‌లు తెలిపారు.
పిడుగు పాటు నుంచి విమానాన్ని రక్షించడానికి మొదట లోహ విహంగంలోని ఏ భాగాన్ని ఆ విపత్తు తాకవచ్చన్నది నిర్ధారించాలని పరిశోధనకు లీడ్ చేసిన ఉదయ్ కుమార్ అనే శాస్త్రవేత్త తెలిపారు. ఇందు కోసం తాము విమానం చుట్టూ విద్యుత్ క్షేత్రాన్ని కొలవడం, విద్యుత్ డిశ్చార్జిలను పరిశీలించడం ద్వారా కంప్యూటేషనల్ మోడల్‌ను అభివృద్ధి చేశామన్నారు.