CM Mamata Benarji: నీతి ఆయోగ్ సమావేశం నుంచి వాకౌట్ చేసిన బెంగాల్ సీఎం
భారత ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం రాష్ట్రపతి భవన్ సాంస్కృతిక కేంద్రంలో జరుగుతుంది.
దిశ, వెబ్‌డెస్క్: భారత ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం రాష్ట్రపతి భవన్ సాంస్కృతిక కేంద్రంలో జరుగుతుంది. ఈ సమావేశానికి కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరు కాలేదు. ఇండియా కూటమిలోని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మాత్రమే ఈ నీతి ఆయోగ్ సమావేశానికి హాజరయ్యారు. ఇదిలా ఉంటే ప్రధాని మోడీ అధ్యక్షతన భేటీ కొనసాగుతుండగా.. బెంగాల్ సీఎం మమతా భెనర్జీ సమావేశం నుంచి వాకౌట్ చేశారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. సమావేశంలో ఇతర ముఖ్యమంత్రులు 15 నిమిషాలు మాట్లాడారని.. తాను మాట్లాడుతుంటే.. మైక్ కట్ చేశారని ఆరోపించారు. అలాగే ఏపీ సీఎం చంద్రబాబు దాదాపు 20 నిమిషాల పాటు మాట్లాడారని,, తనని మాట్లాడకుండా కేంద్ర కక్షపూరితంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. అలాగే వెంటనే ఈ నీతి ఆయోగ్ ను రద్దు చేసి,, దాని స్థానంలో తిరిగి ప్లానింగ్ కమిషన్ ను తీసుకురావాలని ఆమె ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.