‘సిఖ్స్ ఫర్ జస్టిస్‌’పై మరో ఐదేళ్లు నిషేధం..కేంద్ర హోం శాఖ నిర్ణయం

లిస్థానీ వేర్పాటు వాది గురుపత్వంత్ సింగ్ పన్నూన్‌కు చెందిన సిఖ్స్ ఫర్ జస్టిస్(ఎస్ఎఫ్‌జే) సంస్థపై నిషేధాన్ని మరో ఐదేళ్లు పొడిగించారు. ఈ మేరకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.

Update: 2024-07-09 15:00 GMT

దిశ, నేషనల్ బ్యూరో: ఖలిస్థానీ వేర్పాటు వాది గురుపత్వంత్ సింగ్ పన్నూన్‌కు చెందిన సిఖ్స్ ఫర్ జస్టిస్(ఎస్ఎఫ్‌జే) సంస్థపై నిషేధాన్ని మరో ఐదేళ్లు పొడిగించారు. ఈ మేరకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. దేశ అంతర్గత భద్రతకు విఘాతం కలిగించే కార్యకలాపాల్లో ఎస్ఎఫ్‌జే పాలుపంచుకుంటుందని మంత్రిత్వ శాఖ పేర్కొంది. భారతదేశ సార్వభౌమాధికారం, సమగ్రతకు భంగం కలిగించే ఉద్దేశంతో వ్యవహరిస్తున్నందున నిషేధం విధిస్తున్నట్టు తెలిపింది. పంజాబ్‌లో ఈ సంస్థ చర్యలను ఇటీవలే గుర్తించామని, ఇది వేర్పాటువాద గ్రూపులకు మద్దతు ఇస్తుందని స్పష్టం చేసింది. జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) జరిపిన విచారణలో లభించిన సాక్ష్యాల ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. కాగా, 2019 జూలైలో సిఖ్స్ ఫర్ జస్టిస్‌ను కేంద్రం నిషేధించగా..ఇది బుధవారంతో ముగియనుంది. ఈ నేపథ్యంలో మరోసారి బ్యాన్ పొడిగించింది.


Similar News