సుప్రీంకోర్టు పర్యవేక్షణలో 'సిట్‌'తో దర్యాప్తు చేయించాలి.. ఒడిశా రైలు ప్రమాదంపై ప్రతిపక్ష పార్టీల డిమాండ్

ఒడిశా రైలు ప్రమాద ఘటనపై నిపుణులతో కూడిన ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) నియమించి.. సుప్రీంకోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు చేయించాలని 12 ప్రతిపక్ష పార్టీలు డిమాండ్ చేశాయి.

Update: 2023-06-12 16:19 GMT

బాలాసోర్ (ఒడిశా) : ఒడిశా రైలు ప్రమాద ఘటనపై నిపుణులతో కూడిన ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) నియమించి.. సుప్రీంకోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు చేయించాలని 12 ప్రతిపక్ష పార్టీలు డిమాండ్ చేశాయి. కేంద్రం చేతిలో కీలుబొమ్మగా మారిన సీబీఐతో చేయిస్తున్న ఎంక్వైరీ పై ఎవరికీ నమ్మకం లేదని వ్యాఖ్యానించాయి. భువనేశ్వర్‌లోని ఈస్ట్ కోస్ట్ రైల్వే కార్యాలయం ఎదుట కాంగ్రెస్‌ సహా 12 ప్రతిపక్ష పార్టీలు సోమవారం ధర్నాకు దిగాయి.

అంతకుముందు రాజ్‌భవన్‌ ఎదుట కూడా ఆందోళన నిర్వహించాయి. బహనాగ రైలు దుర్ఘటనపై రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ రాజీనామా చేయాలని ప్రతిపక్ష నేతలు డిమాండ్ చేశారు. రైలు ప్రమాదంలో మృతిచెందిన వారి కుటుంబసభ్యులకు రూ.50 లక్షల నష్టపరిహారంతో పాటు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని కోరారు. ఈ పార్టీలు 11 డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని ప్రధాని మోడీకి సమర్పించనున్నాయని సంబంధిత వర్గాలు తెలిపాయి.


Similar News