శ్రీరాముడి కోసం ప్రతి రెండు గంటలకు రెట్టింపు విరాళాలు
శ్రీరామ జన్మభూమి 24 గంటల క్రితం బీబీపీఎస్‌లో చేర్చగా యూపీఐ ద్వారా విరాళాలు ప్రతి రెండు గంటలకు రెట్టింపు అయింది.
దిశ, నేషనల్ బ్యూరో: అయోధ్యలో శ్రీరాముడి ప్రాణప్రతిష్ట నేపథ్యంలో భారత్ బిల్ పేమెంట్ సిస్టమ్ (బీబీపీఎస్) ద్వారా చేసే విరాళాలు ఆదివారం ప్రతి రెండు గంటలకు రెట్టింపు అవుతున్నాయని సంబంధిత వ్యక్తులు తెలిపారు. శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్రం 24 గంటల క్రితం బీబీపీఎస్‌లో చేర్చగా, యూపీఐ ద్వారా వచ్చిన విరాళాల సంఖ్య, అలాగే విలువ పరంగా ప్రతి రెండు గంటలకు రెట్టింపు అయింది. అయోధ్యలో ఈ కార్యక్రమానికి భౌతికంగా హాజరు కాలేనప్పటికీ, భక్తులు డిజిటల్ రూపంలో తమ ప్రేమను తెలియజేస్తున్నారని అధికారులు తెలిపారు. భారత్ బిల్ పేమెంట్ సిస్టమ్ దేశీయ బిల్లులు, విరాళాల చెల్లింపునకు ఏర్పడిన నెట్‌వర్. దీన్ని వినియోగదారులు చెల్లింపులను వివిధ పేమెంట్ యాప్‌ల ద్వారా కూడా చేయవచ్చు.