Awards: 15 మంది నర్సులకు ఫ్లోరెన్స్ నైటింగేల్ అవార్డ్స్.. అందజేసిన రాష్ట్రపతి ముర్ము

2024 ఏడాదికి గాను నేషనల్ ఫ్లోరెన్స్ నైటింగేల్ అవార్డులను 15 మంది నర్సులకు రాష్ట్రపతి ముర్ము బుధవారం అందజేశారు.

Update: 2024-09-11 14:30 GMT

దిశ, నేషనల్ బ్యూరో: 2024 ఏడాదికి గాను నేషనల్ ఫ్లోరెన్స్ నైటింగేల్ అవార్డులను 15 మంది నర్సులకు రాష్ట్రపతి ముర్ము బుధవారం అందజేశారు. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో జరిగిన కార్యక్రమంలో ముర్ము అవార్డును ప్రదానం చేశారు. 15 మంది నర్సులు తమ సేవలను అత్యుత్తమంగా నిర్వహించారని కొనియాడారు. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి నడ్డా, కేంద్ర సహాయ మంత్రి అనుప్రియా పటేల్ ఇతర ప్రముఖులు అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమానికి హాజరయ్యారు. అనంతరం జేపీ నడ్డా మాట్లాడుతూ ఆరోగ్య రంగంలో నర్సులు వెన్నెముక లాంటివారని తెలిపారు. ప్రజా సేవలో వారు మరింత ముందుకు సాగాలని ఆకాంక్షించారు. అవార్డుకు ఎంపికైన వారిని అభినందనలు తెలిపారు. కాగా, నేషనల్ ఫ్లోరెన్స్ నైటింగేల్ అవార్డును ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ 1973లో స్థాపించింది. నర్సులు, నర్సింగ్ నిపుణులు సమాజానికి అందించిన విశేష సేవలకు గుర్తింపుగా ఈ అవార్డును అందజేస్తారు. ప్రతి అవార్డులో మెరిట్ సర్టిఫికేట్, రూ.లక్ష నగదు ఉంటాయి.


Similar News