UP: వీడని జంతవులు బెడద.. క్రూరమృగాల దాడిలో ఇద్దరు చిన్నారులు మృతి

ఉత్తర్‌ప్రదేశ్‌ ప్రజలున తోడేళ్ల భయం వీడకముందే.. ఇప్పుడు చిరుత దాడులు ప్రారంభమైనట్లు తెలుస్తోంది.

Update: 2024-10-06 07:03 GMT

దిశ, నేషనల్ బ్యూరో: ఉత్తర్‌ప్రదేశ్‌ ప్రజలున తోడేళ్ల భయం వీడకముందే.. ఇప్పుడు చిరుత దాడులు ప్రారంభమైనట్లు తెలుస్తోంది. యూపీలోని లఖింపూర్ ఖేరీ(Lakhimpur Kheri) జిల్లాలో వన్యప్రాణుల దాడిలో ఇద్దరు చిన్నారులు మృతి చెందినట్లుగా తెలుస్తోంది. శనివారం సాయంత్రం గంగాబెహర్ గ్రామానికి చెందిన సాజేబ్ (12) శారదానగర్ అటవీ ప్రాంతానికి సమీపంలో సైకిల్‌పై ఎరువుల బస్తాలను గ్రామానికి తీసుకు వెళ్తున్నాడు. అదే సమయంలో అక్కడే ఉన్న అడవి జంతువు బాలుడిపై దాడి చేసి.. అతడ్ని పొదల్లోకి ఈడ్చుకెళ్లింది. స్థానికులు, కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో గాలింపు చర్యలు చేపట్టారు. శనివారం అర్థరాత్రి గ్రామశివార్లలో బాలుడి డెడ్ బాడీని పోలీసులుగు గుర్తించారు. బాలుడిపై చిరుత పులి(leopard) దాడి చేసి ఉంటుందని డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ సంజయ్ బిస్వాల్ అనుమానం వ్యక్తం చేశారు. దాన్ని గుర్తించేందుకు అటవీశాఖ అధికారులు బృందాలుగా ఏర్పడి గాలిస్తున్నామని వెల్లడించారు. మరోవైపు, లఖింపూరి ఖేరీ జిల్లాలోని కుర్తైహా గ్రామంలోని ఇంట్లోకి చిరుత పులి చొరబడి రిజా బానో(3) అనే చిన్నారిని ఎత్తుకెళ్లినట్లు స్థానికులు పేర్కొన్నారు. బాలిక మృతదేహం గాగ్రా నదిలో లభ్యమైనట్లుగా పోలీసులు చెప్పారు. దుధ్వా టైగర్ రిజర్వ్ బఫర్ జోన్ పరిధిలోకి కుర్తైహా గ్రామం వస్తుందని అటవీ శాఖ అధికారులు తెలిపారు. ఇంతకు ముందు ఎప్పుడూ ఈ ప్రాంతంలో క్రూర జంతువుల సంచారం ఉన్నట్లు సమాచారం రాలేదని అన్నారు.

ఆపరేషన్ భేడియా సక్సెస్

ఉత్తరప్రదేశ్‌లోని బహ్రెయిచ్‌ జిల్లా వాసులను వణికించిన తోడేళ్ల కథ ముగిసింది. ఆపరేషన్‌ భేడియా సక్సెస్ ఫుల్ అయ్యింది. బహ్రెయిచ్‌లో మనుషులపై దాడులు చేసిన ఆరు తోడేళ్లలో ఐదు ఇప్పటికే పట్టుబడగా శనివారం ఆరో తోడేలును గ్రామస్థులే చంపారు. మేకను వేటాడుతుండగా గ్రామస్తులు ఆరో తోడేలును కొట్టి చంపినట్లు అటవీశాఖ అధికారులు తెలిపారు. ఐదో తోడేలు పట్టుబడ్డాక 24 రోజులుగా ఆరో తోడేలు కోసం అటు అటవీశాఖ అధికారులు, ఇటు గ్రామస్థులు వెతుకుతూనే ఉన్నారు.కాగా, శనివారం గ్రామస్థులు ఆరో తోడేలును మట్టుబెట్టారు. అయితే గ్రామస్తుల దాడిలో మరణించిన ఆరో తోడేలు మ్యాన్‌ఈటర్‌ అని చెప్పలేమని అటవీ అధికారులు అన్నారు. గత కొన్ని నెలలుగా బహ్రెయిచ్‌లో ఆరు తోడేళ్ల గుంపు అక్కడి ప్రజలపై దాడులు చేస్తూ భయభ్రాంతులకు గురి చేసింది. తోడేళ్ల దాడుల్లో తొమ్మిది మంది పిల్లలు, ఒక మహిళ మృతి చెందగా 50 మంది దాకా గాయపడ్డారు.


Similar News