వార్మమ్ మ్యాచ్ ఆస్ట్రేలియాదే -నమీబియాపై ఈజీ విక్టరీ
మరికొద్ది రోజుల్లో టీ20 వరల్డ్ కప్ అధికారికంగా ప్రారంభం కానుంది. ఈ క్రమంలోనే ఆస్ట్రేలియా వర్సెస్ నమీబియా మధ్య తొలి వార్మమ్ మ్యాచ్ జరిగింది.
దిశ, స్పోర్ట్స్ : మరికొద్ది రోజుల్లో టీ20 వరల్డ్ కప్ అధికారికంగా ప్రారంభం కానుంది. ఈ క్రమంలోనే ఆస్ట్రేలియా వర్సెస్ నమీబియా మధ్య తొలి వార్మమ్ మ్యాచ్ జరిగింది. అయితే, విండీస్ వేదికగా జరిగిన మ్యాచులో ఓ విచిత్రం చోటుచేసుకుంది. గతంలో ఎన్నడూ లేనివిధంగా కేవలం 9 మంది ఆటగాళ్లతోనే ఆసీస్ జట్టు మ్యాచ్ ఆడింది. ఎందుకంటే ఐపీఎల్ కారణంగా చాలా మంది ఆసీస్ కీలక ఆటగాళ్లు విండీస్ చేరుకోలేదు. జూన్ -5వ తేదీలోపు పాట్ కమిన్స్ తో పాటు ఇతర కీలక ఆటగాళ్లు విండీస్‌కు చేరుకోనున్నారు.
ఈ క్రమంలోనే నమీబియాతో జరిగిన వార్మప్ మ్యాచులో సరిపడా ఆటగాళ్లు లేకపోవడంతో ఆసీస్ చీఫ్ సెలక్టర్ జార్జ్ బెయిలీ, ప్రధాన కోచ్ ఆండ్రూ మెక్ డొనాల్డ్ మైదానంలోకి దిగారు. వారితో పాటు సహాయక సిబ్బంది కూడా ఫీల్డింగ్ చేయాల్సి వచ్చింది. అయితే,జూన్ -5వ తేదీనే ఆసీస్ ఒమన్‌తో తొలి టీ20 ఆడనుంది.
వార్నర్ కమ్‌బ్యాక్..
ఐపీఎల్లో ఢిల్లీ తరఫున ఆడిన డేవిడ్ వార్నర్ ఈ సీజన్‌లో పెద్దగా ఆకట్టుకోలేదు. కానీ నమీబియాతో జరిగిన మ్యాచులో వార్నర్ తనదైన కమ్ బ్యాక్ ఇచ్చాడు. కేవలం 21 బంతుల్లో 54 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. నిర్ణీత 20 ఓవర్లలో నమీబియా 119/9 పరుగులు చేయగా..కేవలం 10 ఓవర్లలోనే ఆస్ట్రేలియా లక్ష్యాన్ని ఛేదించింది. ఆసీస్ జట్టులో డేవిడ్ వార్నర్ 54/21, మాథ్యూ వేడ్ 12, టిమ్ డేవిడ్ 23 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు.