Independence Day: ఢిల్లీ మంత్రి అతిశీ జెండా ఎగురవేయరాదు

స్వాతంత్య్ర వేడుకలకు ఢిల్లీ ప్రభుత్వ అధికారిక కార్యక్రమంలో జాతీయ జెండాను ఎవరు ఎగురవేస్తారనే దానిపై అనిశ్చితి నెలకొంది.

Update: 2024-08-13 09:42 GMT

దిశ, నేషనల్ బ్యూరో: స్వాతంత్య్ర వేడుకలకు ఢిల్లీ ప్రభుత్వ అధికారిక కార్యక్రమంలో జాతీయ జెండాను ఎవరు ఎగురవేస్తారనే దానిపై అనిశ్చితి నెలకొంది. ఎక్సైజ్ పాలసీ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ జైలులో ఉన్నారు. అయితే, ఆయన స్థానంలో ఆగస్టు 15న ఢిల్లీమంత్రి, ఆప్ నేత అతిశీ జాతీయ జెండా ఆవిష్కరించాలని భావిస్తున్నారు. ఈ మేరకు ఆప్ నేత గోపాల్ రాయ్.. జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్ మెంట్(GAD)కు లేఖ రాశారు. కానీ, ఆ వినతిని జీఏడీ తోసిపుచ్చింది.

నిబంధనలకు వ్యతిరేకం

సీఎం కేజ్రీవాల్ అతిశీ జెండా ఎగురవేయాలని కోరుకుంటున్నట్లు జీఏడీకి మంత్రి గోపాల్ రాయ్ లేఖ రాశారు. ఆ మరుసటి రోజే జీఏడీ అదనపు ప్రధాన కార్యదర్శి నవీన్ కుమార్ దీనిపై స్పందించారు. ఈ అంశం చట్టబద్ధంగా చెల్లుబాటు కాదని పేర్కొన్నారు. ఆప్ నేత రాసిన లేఖ‌కు అర్హ‌త ఉండ‌ద‌ని, దాన్ని ఆమోదించ‌లేమ‌న్నారు. అయితే రాష్ట్ర ప్ర‌భుత్వం త‌ర‌పున జెండా ఎగుర‌వేసేందుకు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ వ‌చ్చేలా ఏర్పాట్లు చేయాల‌ని జ‌న‌ర‌ల్ అడ్మినిస్ట్రేష‌న్ శాఖ తెలిపింది. కానీ ఆయ‌న జ్యూడీషియ‌ల్ క‌స్ట‌డీలో ఉన్న నేప‌థ్యంలో దీనిపై నిర్ణ‌యాన్ని ప్ర‌స్తుతం పెండింగ్‌లో పెట్టారు. మ‌రోవైపు స్వాతంత్య్ర దినోత్స‌వ సంబ‌రాలకు ఏర్పాట్లు జ‌రుగుతున్నాయి. ఢిల్లీలో రాష్ట్ర ప్ర‌భుత్వం ఛాత్రాసాల్ స్టేడియంలో జాతీయ జెండాను ఎగుర‌వేస్తుంది.

ఎల్జీకి కేజ్రీవాల్ లేఖ

స్వాతంత్ర్య దినోత్సవ కార్యక్రమంలో అతిశీ తన స్థానంలో జాతీయ జెండాను ఎగురవేస్తానని కేజ్రీవాల్ ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనాకు లేఖ రాశారు. అయితే తమకు ముఖ్యమంత్రి నుంచి ఎలాంటి సమాచారం అందలేదని ఎల్‌జీ కార్యాలయం పేర్కొంది. ఇంతలో, తీహార్ జైలు అధికారులు కేజ్రీవాల్‌ ఎల్‌జీకి రాసిన లేఖ గురించి స్పందించారు. ఢిల్లీ జైలు నిబంధనల ప్రకారం అతనికి మంజూరు చేయబడిన “అధికారాలను దుర్వినియోగం” చేసిందని.. అందువల్ల లేఖ పంపలేదని పేర్కొన్నారు.


Similar News