అసోంలో వరదల వల్ల 52కి చేరిన మృతుల సంఖ్య

అసోం రాష్ట్రాన్ని వరదలు ముంచెతుతుతున్నాయి. ఇప్పటివరదల వల్ల 52 మంది చనిపోయినట్లు అధికారులు తెలిపారు.

Update: 2024-07-06 08:43 GMT

దిశ, నేషనల్ బ్యూరో: అసోం రాష్ట్రాన్ని వరదలు ముంచెతుతుతున్నాయి. ఇప్పటివరదల వల్ల 52 మంది చనిపోయినట్లు అధికారులు తెలిపారు. వేలాది మంది నిరాశ్రయులైనట్లు వివరించారు. అసోంలోని 35 జిల్లాలో 30 జిల్లాలు తీవ్రంగా ప్రభావితమైనట్లు పేర్కొన్నారు. దాదాపు 24 లక్షల మంది వరదల వల్ల ప్రభావితమయ్యారని వివరించారు. అసోంలోని బార్‌పేట జిల్లాలో దాదాపు 1,571.5 హెక్టార్ల విస్తీర్ణంలో పంట నష్టం జరిగింది. దాదాపు 1.4 లక్షల మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. మొత్తం 179 గ్రామాలు నీట మునిగాయి. ఇకపోతే, ధుబ్రి జిల్లాలో దాదాపు 7 లక్షల మంది వరదల వల్ల ప్రభావితం అయ్యారు. 63 వేల హెక్టార్ల విస్తీర్ణంలో పంట మునిగిపోయింది. ధుబ్రి జిల్లాలో 3,158 గ్రామాలు జలదిగ్బంధంలోకి వెళ్లాయి.

వరద పరిస్థితిని సమీక్షించిన సీఎం

అసోం స్టేట్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ ప్రకారం.. నీమతిఘాట్, గౌహతి, గోల్ పరా, ధుబ్రి ప్రాంతాల్లో బ్రహ్మపుత్ర నది ప్రమాదకస్థాయిలో ప్రహిస్తుంది. అసోం వ్యాప్తంగా సహాయక చర్యలు చేపట్టేందుకు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగాయి. వరద పరిస్థితిని సమీక్షించేందుకు అసోం ముఖ్యమంత్రి దిబ్రూగఢ్ సిటీని సందర్శించారు. ప్రతి ఒక్కరికి సాయం చేయడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు. అసోం గవర్నర్ గులాబ్ చంద్ కటారియా, కేంద్రమంత్రి సర్బానంద సోనోవాల్ కూడా వరద ప్రభావిత జిల్లాలను సందర్శించారు. అన్ని రకాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు.


Similar News