Asaduddin : ఈవీఎంలను బద్నాం చేయడం కాంగ్రెస్‌కు అలవాటైంది : ఒవైసీ
దిశ, నేషనల్ బ్యూరో : హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినందుకు ఈవీఎంలను కాంగ్రెస్ పార్టీ దూషిస్తుండటం విడ్డూరంగా ఉందని మజ్లిస్ చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ అన్నారు.
దిశ, నేషనల్ బ్యూరో : హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినందుకు ఈవీఎంలను కాంగ్రెస్ పార్టీ దూషిస్తుండటం విడ్డూరంగా ఉందని మజ్లిస్ చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. ఎన్నికల్లో గెలిచినప్పుడు సంబురాలు చేసుకోవడం, ఓడిపోయినప్పుడు ఈవీఎంలను బద్నాం చేయడం కాంగ్రెస్‌కు అలవాటైపోయిందని ఆయన ఎద్దేవా చేశారు.
హర్యానాను పదేళ్లుగా పాలిస్తున్న బీజేపీ ప్రభుత్వం ఎదుర్కొన్న తీవ్ర ప్రజా వ్యతిరేకతను కాంగ్రెస్ పార్టీ సానుకూలంగా మార్చుకోలేకపోయిందని ఒవైసీ పేర్కొన్నారు. కాంగ్రెస్‌లోని వర్గ విభేదాలను ఆసరాగా చేసుకొని ఎన్నికల్లో బీజేపీ నెగ్గుకొచ్చిందని ఆయన చెప్పారు. బీజేపీని ఓడించే బంగారు అవకాశాన్ని కాంగ్రెస్ చేజార్చుకుందన్నారు. ప్రముఖ వార్తాసంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఒవైసీ ఈ వ్యాఖ్యలు చేశారు.