ఒకే ఒక్క ఛాన్స్ అంటున్న ఢిల్లీ సీఎం Arvind Kejriwal.. ఎందుకో తెలుసా!
గుజరాత్‌లో ఈసీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన వెంటనే ఢిల్లీ సీఎం, ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ రాష్ట్ర ప్రజలకు కీలక విజ్ఞప్తి చేశారు..Latest Telugu News
న్యూఢిల్లీ: గుజరాత్‌లో ఈసీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన వెంటనే ఢిల్లీ సీఎం, ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ రాష్ట్ర ప్రజలకు కీలక విజ్ఞప్తి చేశారు. తమ పార్టీ రాబోయే రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో తప్పనిసరిగా విజయం సాధిస్తుందని అన్నారు. ఒక్క అవకాశం ఇవ్వాలని ఆయన గుజరాత్ ప్రజలను కోరారు. ఈ మేరకు గుజరాత్ ప్రజలను ఉద్దేశించి గురువారం ట్విట్టర్ ద్వారా వీడియో సందేశమిచ్చారు.
'నేను మీ కుటుంబంలో సభ్యుడిని, మీ సోదరుడిని. నాకు ఒక్క అవకాశం ఇస్తే నేను మీకు ఉచిత విద్యుత్ అందిస్తాను. పాఠశాలలు నిర్మించి, వైద్యాన్ని కూడా అందిస్తాను. అంతేకాకుండా ఫ్రీగా అయోధ్య రామమందిరానికి తీసుకెళ్తాను' అని కేజ్రీవాల్ చెప్పారు. ప్రస్తుతం తాము 90-92 సీట్లు గెలిచే అవకాశం ఉందని, ఇదే జోష్ కొనసాగితే 140 నుంచి 150 స్థానాల్లో గెలుపొందుతామని ఆప్ ప్రతినిధి సౌరభ్ భరద్వాజ్ అన్నారు.
Arvind Kejriwal
ఈ సారి ఎన్నికల్లో 182 స్థానాల్లో బరిలోకి దిగుతున్నామని చెప్పారు. గతేడాది 30 స్థానాల్లో బరిలోకి దిగినప్పటికీ, ఒక్క స్థానంలోనూ విజయం సాధించలేకపోయింది. అయితే ఆప్ పెద్దగా ప్రభావం చూపించదని కాంగ్రెస్, బీజేపీ నేతలు ఆరోపించారు.