Army Drone :పాక్ భూభాగంలోకి భారత నిఘా డ్రోన్

దిశ, నేషనల్ బ్యూరో : పాకిస్తాన్, చైనా సరిహద్దుల్లో పహారా కోసం భారత సైన్యం చాలా కాలంగా నిఘా డ్రోన్లను కూడా వినియోగిస్తోంది.

Update: 2024-08-23 13:16 GMT

దిశ, నేషనల్ బ్యూరో : పాకిస్తాన్, చైనా సరిహద్దుల్లో పహారా కోసం భారత సైన్యం చాలా కాలంగా నిఘా డ్రోన్లను కూడా వినియోగిస్తోంది. వాటిలో ఒక నిఘా డ్రోన్ అనుకోకుండా కశ్మీర్‌లోని రాజౌరీ సెక్టార్ వద్దనున్న సరిహద్దు నియంత్రణ రేఖ (ఎల్‌ఓసీ)ను దాటేసి పాకిస్తాన్‌లో ల్యాండ్ అయింది. దీంతో అక్కడ గస్తీ కాస్తున్న పాక్ ఆర్మీ దాన్ని స్వాధీనం చేసుకుంది.

శుక్రవారం ఉదయం 9.30 గంటల సమయంలో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. ఈనేపథ్యంలో నిఘా డ్రోన్ అనుకోకుండా పాక్ భూభాగంలోకి ప్రవేశించిన విషయంపై పాకిస్తాన్ ఆర్మీతో భారత మిలిటరీ ఆపరేషన్స్ డైరెక్టర్ జనరల్ సంప్రదింపులు జరపనున్నారు.


Similar News