Delhiలో దారుణంగా పడిపోయిన గాలి నాణ్యత.. డేంజర్ బెల్స్ మోగిస్తున్న కాలుష్యం
దేశ రాజధాని ఢిల్లీలో గాలి కాలుష్యం డేంజర్ బెల్స్ మోగిస్తోంది. నిన్న, మొన్నటి వరకు 400 దాటిన ఏక్యూఐ (AQI) ఇప్పుడు ఏకంగా 500 దాటేసింది.
దిశ, వెబ్‌డెస్క్: దేశ రాజధాని ఢిల్లీలో గాలి కాలుష్యం డేంజర్ బెల్స్ మోగిస్తోంది. నిన్న, మొన్నటి వరకు 400 దాటిన ఏక్యూఐ (AQI) ఇప్పుడు ఏకంగా 500 దాటేసింది. దీంతో ఢిల్లీ-ఎన్‌సీఆర్ పరిధిలో నివశించేవారి ఆరోగ్యానికి ఇది తీవ్ర హాని కలిగించే ప్రమాదం నెలకొంది. గాలి క్వాలిటీ (Air Quality) గురించి తెలియజేసే ఐక్యూఏఐఆర్ వెబ్‌సైట్ ప్రకారం.. ఢిల్లీలో ఆదివారం ఉదయం గాలి నాణ్యత ఏకంగా 507 ఏక్యూఐకి పడిపోయింది. ఇది డబ్లూహెచ్‌వో (WHO) నిర్ధారించిన పీఎం2.5 రేఖ కంటే 65 రెట్లు పడిపోయినట్లు వెల్లడవుతోంది.
ఇదిలా ఉంటే సాధారణంగా గాలి నాణ్యత అంటే ఏక్యూఐ 200 నుంచి 300 మధ్య ఉంటే బాగాలేదని, 301 నుంచి 400 వరకు ఉంటే కాలుష్యం ఎక్కువైందని, 401 నుంచి 500 వరకు ఉంటే ప్రాణాంతకమని నిపుణులు చెబుతున్నారు.