నోటీసులు ఇచ్చినా వెనక్కి తగ్గని లేడీ సింగర్! (వీడియో)
యూపీలో తల్లి కూతుళ్ల మృతిపై పాట పాడిన ప్రముఖ భోజ్ పురి సింగర్ నేహా సింగ్ రాథోడ్‌కు యోగి సర్కార్ నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే.
దిశ, డైనమిక్ బ్యూరో: యూపీలో తల్లి కూతుళ్ల మృతిపై పాట పాడిన ప్రముఖ భోజ్ పురి సింగర్ నేహా సింగ్ రాథోడ్‌కు యోగి సర్కార్ నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే నోటీసులు ఇచ్చినా ఆమె వెనక్కి తగ్గడం లేదు. మరోసారి యోగి సర్కార్‌ను టార్గెట్ చేసింది. శుక్రవారం తాజాగా మరో పాటను విడుదల చేసి సంచలనంగా మారింది. ఈసారి విడుదల చేసిన పాటలో నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలంటూ పాట పాడింది. 'యూపీ మే కా బా' పేరుతో ఆమె పాడిన పాటలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
అయితే ఆమె పాటలు ప్రజలను రెచ్చగొట్టే విధంగా ఉన్నాయంటూ యూపీ సర్కార్ ఇటీవల నోటీసులు జారీ చేసింది. మూడు రోజుల్లో వివరణ ఇవ్వకుంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. నోటీసులు అందుకున్నప్పటికీ నేహా సింగ్ రాథోడ్ మాత్రం వెనకడుబు వేయడం లేదు. తాజాగా నిరుద్యోగ సమస్యను లేవనెత్తుతు తన గళాన్ని వినిపిస్తోంది. ఈ క్రమంలో ట్విట్టర్ లో హిట్లర్ ఫోటోను షేర్ చేస్తూ ఆమె చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. 'ఆయన గొప్ప జాతీయవాది. అతడి పేరు హిట్లర్. అతను జర్మనీలో నివసించాడు.
జర్మనీ ప్రజలందరూ హిట్లర్‌కు మద్దతుగా నిలిచారు. హిట్లర్ యూదు ప్రజలను అసహ్యించుకున్నాడు. అయితే హిట్లర్ గొప్ప జాతీయవాది కాబట్టి ఎవరైనా అతని విధానాన్ని విమర్శించడం ప్రజలకు ఇష్టం లేదు' అంటూ ఆమె ట్వీట్ చేశారు. అయితే నేహా చేసిన ఈ వ్యాఖ్యలు యోగీని ఉద్దేశించినవేనా లేక ప్రధాని నరేంద్ర మోడీని ఉద్దేశించి పరోక్షంగా విమర్శించిందా అనేది హాట్ టాపిక్ గా మారింది. తాను ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారని ప్రభుత్వాన్ని నిలదీయడమే ఈ ట్వీట్ ఉద్దేశం అనే చర్చ జరుగుతోంది.
बेरोज़गार बानी साहेब रोजगार मांगीला... #nehasinghrathor #unemployment #रोज़गार #बेरोज़गारी #jobs #youth pic.twitter.com/h7L321DIKG
— Neha Singh Rathore (@nehafolksinger) February 24, 2023
एक महान राष्ट्रवादी था. उसका नाम हिटलर था. वो जर्मनी में रहता था. पूरी जर्मनी की जनता हिटलर की समर्थक थी. हिटलर यहूदी लोगों से नफ़रत करता था.
— Neha Singh Rathore (@nehafolksinger) February 24, 2023
जनता को एकदम पसंद नहीं था कि कोई हिटलर की किसी नीति की आलोचना करे,क्योंकि वो एक महान राष्ट्रवादी था.
फिर एक दिन सब ठीक हो गया.🙂 pic.twitter.com/BMHMiq1Fbs