మీడియా రంగంలో సంచలనం.. ప్రముఖ వార్తా సంస్థ మూసివేత
అమెరికాలో మరో సంచలనం నమోదు అయింది....

దిశ, వెబ్ డెస్క్: అమెరికా(America)లో మరో సంచలనం నమోదు అయింది. ప్రముఖ వార్తా సంస్థ మూతపడింది. ఇటీవల దేశవ్యాప్తంగా జరిగిన ఎన్నికల్లో డ్రొనాల్డ్ ట్రంప్(Dronald Trump) గెలిచి.. అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి పదవీ బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. అయితే అప్పటి నుంచి పెను సంచలన నిర్ణయాలను తీసుకుంటున్నారు. అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తొలి నాళ్లలోనే అక్రమ వలసదారులపై వేటు వేశారు. అలాంటి వారందరిని గుర్తించి కట్టడి చేసేందుకు వీసాలపై కఠిన నిర్ణయాలు తీసుకున్నారు.
ఇప్పుడు మరో సంచలాత్మక నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వం నడుపుస్తున్న వాయిస్ ఆఫ్ అమెరికా వార్తా సంస్థ(Voice of America news agency)ను మూసివేశారు. అంతేకాదు ఈ ఉత్తర్వులపై సంతకం సైతం చేశారు. రాడికల్ భావజాలాన్ని(Radical ideology) ఈ రేడియో ఛానల్ ప్రచారం చేస్తోందని, యాంటి ప్రభుత్వ విధానాలను ప్రజలకు వినిపిస్తోందన్న ఆరోపణలపై ట్రంప్ సర్కార్ సీరియస్ అయింది. పన్నులు కట్టే ప్రజలపై రాడికల్ ప్రాపగాండా ఇకపై పడకూదనే భావనతోనే ఈ సంస్థను మూసివేస్తున్నట్లు శ్వేత సౌధం(White House) నుంచి ప్రకటనను విడుదల చేశాయి. ప్రతిపక్ష ధోరణితో పాటు వామపక్ష భావజాలాన్ని విస్తృతంగా ప్రచారం చేస్తోందని రైట్ వింగ్ రాజకీయ నేతలు, మీడియా నుంచి వెలువడిన కొన్ని వ్యాఖ్యలను సైతం ప్రకటనకు జత చేసింది.
కాగా రెండో ప్రపంచ యుద్ధ సమయంలో నాజీ ప్రచారాల(Nazi propaganda)ను తిప్పికొట్టాలని అప్పటి ప్రభుత్వం వాయిస్ ఆఫ్ అమెరికా పేరుతో రేడియో సర్వీసును అందుబాటులోకి తీసుకొచ్చింది. 1300 మంది సిబ్బందితో ఈ సంస్థ ఇప్పటికీ రన్ అవుతోంది. ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది ప్రజలు ఈ రేడియో సర్వీసును వినియోగించుకుంటున్నారు. తమపై జరుగుతున్న ప్రచారాన్ని ఈ రేడియో ఛానల్ ద్వారా అమెరికా ప్రభుత్వంపై తిప్పికొడుతూ వస్తోంది. అయితే ట్రంప్ సర్కార్ ఆకస్మికంగా మూసివేత నిర్ణయం తీసుకుంది.
దీంతో వాయిస్ ఆఫ్ అమెరికా డైరెక్టర్ అబ్రమోవిట్ట్ ఆవేదన వ్యక్తం చేశారు. తనతో పాటు 1300 సిబ్బందికి ఎలాంటి పని, వేతనం లేకుండా పోయిందని వాపోయారు. అమెరాకాపై ఇరాన్, చైనా, రష్యా లాంటి దేశాలు ప్రస్తుతం తప్పుడు కథనాలతో దుష్ఫ్రచారం చేస్తున్నాయని, ఇందుకోసం వేల కోట్ల డాలర్లను ఖర్చు చేస్తున్నాయని ఆయన ఆరోపించారు. ఇలాంటి సమయంలో రేడియో సర్వీసుపై ట్రంప్ సర్కార్ తీసుకున్న నిర్ణయం.. తమ లక్ష్యాలకు అనుగుణంగా పని చేసే ఛాన్స్‌ను మిస్ చేసిందని అబ్రమోవిట్జ్ పేర్కొన్నారు.
Read More..