బడిలో మొదలైన ప్రేమ.. చివరకు మూడు ముళ్లతో ఏకమైన రాధిక, అనంత్ అంబానీ!
అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ మూడు ముళ్ల బంధంతో ఒకటి అయ్యారు. ముఖేష్ అంబానీ ఘనంగా వీరి వివాహాన్ని ముంబైలో గుజరాతీ సంప్రదాయపద్ధతిలో జరిపించారు. అయితే తాజాగా అనంత్ అంబానీ
దిశ, ఫీచర్ : అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ మూడు ముళ్ల బంధంతో ఒకటి అయ్యారు. ముఖేష్ అంబానీ ఘనంగా వీరి వివాహాన్ని ముంబైలో గుజరాతీ సంప్రదాయపద్ధతిలో జరిపించారు. అయితే తాజాగా అనంత్ అంబానీ, రాధిక మర్చంట్లకు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అది ఏమిటంటే?
వీరి వివాహానికి సంబంధించిన పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. దీంతో కొంత మంది చాలా అందంగా ఉన్న రాధిక, అనంత్ అంబానీని ఎలా ఇష్టపడింది అంటూ కామెంట్స్ చేయగా, వీరి లవ్ ఇప్పటిది కాదు అంటూ కొంత మంది వారి ప్రేమగురించి చెప్తున్నారు. కాగా, అసలు వీరి లవ్ ఎప్పుడు మొదలైంది? ఏంటీ అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
అనంత్ , రాధికల ప్రేమ ఇప్పటిది కాదంట. తన చిన్నప్పటి నుంచే రాధికకు అనంత్ అంటే చాలా ఇష్టం ఉండేదంట. వీరు స్కూల్లో ఉన్నప్పుడే ఇద్దరి మధ్య స్నేహం ఏర్పడి అది కాస్త ప్రేమగా మారిందంట. దీంతో అనంత్ ఫ్యామిలీలో ఏ వేడుక జరిగినా రాధికను పిలిచేవారంట. రాధికకు అనంత్ అన్నా, తన ఫ్యామిలీ అన్న గౌరవం, ఇష్టం అంట. అంతే కాకుండా ఆయన ఆరోగ్యం గురించి కూడా పూర్తిగా తెలుసునంట, చాలా సందర్భల్లో ఆయనకు రాధిక ధైర్యాన్ని ఇచ్చేదంట. వీరిద్దరు ఒకరికి ఒకరు ఎదురు పడినప్పుడు, చాలా సంతోషంగా ఫీల్ అయ్యేవారంట. అనంత్ ఎప్పుడూ రాధిక చాలా మంచి అమ్మాయి,నాకు తాను భాగస్వామిగా రావడం చాలా అదృష్టం అని చెప్తుండేవాడంట. అంతే కాకుండా, రాధికకు అనంత్ అంటే అమితమైన ప్రేమ అంట. అనంత్ ఇష్టాలనే తన ఇష్టాలుగా మలుచుకొని, ఎంతో ఇష్టాన్ని చూపిస్తూ ఉంటుందంట.