భారత ఫిల్మ్ ఫెస్టివల్‌కి జుట్టు, తాళం పంపిన ఇరాన్ ఫిల్మ్ మేకర్
భారత్‌లోని కేరళాలో జరుగుతున్న ఫిల్మ్ ఫెస్టివల్‌కి ఇరాన్ ఫిల్మ్ మేకర్, మహిళా హక్కుల కార్యకర్త మహనాజ్ మొహమ్మదీ జుట్టును పంపడం జరిగింది.
దిశ, వెబ్‌డెస్క్: భారత్‌లోని కేరళాలో జరుగుతున్న ఫిల్మ్ ఫెస్టివల్‌కి ఇరాన్ ఫిల్మ్ మేకర్, మహిళా హక్కుల కార్యకర్త మహనాజ్ మొహమ్మదీ జుట్టును పంపడం జరిగింది. కాగా ఆమెపై హిజాబ్ వ్యతిరేక నిరసనల కారణంగా పలు దేశాలకు ఆమె ప్రయాణించడం నిషేదంలో ఉంది. మహనాజ్ స్పిరిట్ ఆఫ్ సినిమా అవార్డును అందుకోవడం కోసం ఆమె భారత్ రావాల్సి ఉంది. కానీ నిషేధం కారణంగా ఆమె ఫిల్మ్ ఫెస్టివల్ లో పాల్గొనకపోవడం వల్ల ఆమె తన జుట్టు కత్తిరించి దానితో పాటు తాళం జత చేసి పంపారు. ఇది కూడా ఓ రకంగా చెప్పాలి అంటే.. హిజాబ్ వ్యతిరేక నిరసనలో భాగమే.. ఎలా అంటే ప్రస్తుతం ఇరాన్ మహిళలు హిజాబ్ కు వ్యతిరేకంగా తమ జుట్టు కత్తిరించి నిరసన తెలుపుతున్నారు.
Also Read.....