స్వ‌చ్ఛందంగా ఉక్రెయిన్ ఆర్మీలో చేరిన భార‌తీయ విద్యార్థి!!

త‌మిళ‌నాడు కుర్రాడు ఉక్రెయిన్ ఆర్మీలో చేరాడు. Tamilnadu youth in Ukraine has joined in Ukraine Para military.

Update: 2022-03-08 12:18 GMT

దిశ‌, వెబ్‌డెస్క్ః ఉక్రెయిన్, ర‌ష్యా మ‌ధ్య యుద్ధం ముదురుతున్న త‌రుణంలో ఎంతో మంది ఉక్రెయిన్ నుండి సుర‌క్షిత ప్రాంతాల‌కు పారిపోయారు. ఆ దేశంలో చ‌దువుకుంటున్న భార‌తీయ విద్యార్థులు మ‌మ్మ‌ల్ని వెంట‌నే ఇండియాకు త‌ర‌లించండంటూ వేడుకున్నారు. అయితే, ఉడుకు ర‌క్తం ఉర‌క‌లేస్తున్న ఓ త‌మిళ‌నాడు కుర్రాడు మాత్రం యుద్ధభూమిలో ఉండ‌ట‌మే కాదు, ఆయుధం ప‌ట్టి నాకు ఆశ్ర‌య‌మిచ్చిన దేశానికి అండ‌గా ఉంటానంటూ బ‌య‌లుదేరాడు. చ‌దువుకోడానికి ఉక్రెయిన్ వెళ్లిన‌ 21 ఏళ్ల తమిళనాడు యువకుడు సాయినిఖేష్ రవిచంద్రన్ నిర్ణ‌య‌మిది. అయితే, దీని వెనుక ఒక ఆశ‌యం కూడా లేక‌పోలేదు. ర‌విచంద్ర‌న్‌కు ఆర్మీలో ప‌నిచేయడ‌మంటే ఇష్టం. దానిక కోసం ఇండియాలో ఉన్న‌ప్పుడు రెండుసార్లు ఆర్మీలో చేర‌డానికి ప్ర‌య‌త్నించాడు. అయితే, ఎత్తు స‌రిపోలేద‌ని అత‌ణ్ణి నిరాక‌రించారు.

తాజాగా వెలువ‌డిన ఇండియా సెంట్ర‌ల్‌ ఇంటెలిజెన్స్ నివేదిక ప్రకారం, ర‌విచంద్ర‌న్ ఉక్రెయిన్ బ‌ల‌గాల్లో ఒక‌టైన జార్జియన్ నేషనల్ లెజియన్ పారామిలిటరీ యూనిట్‌లో చేరాడు. ఉక్రెయిన్‌లోని ఖార్కివ్ నేషనల్ యూనివర్శిటీలో ఏరోస్పేస్ ఇంజనీరింగ్ విద్యార్థి అయిన‌ సాయినిఖేష్ ఇండియా తిరిగి రానంటున్నాడు. కోయంబత్తూరులోని తుడియాలూరు సమీపంలోని సుబ్రమణ్యం పాళయంలోని స్వగ్రామంలో నివసిస్తున్న తల్లిదండ్రులకు కూడా ఈ విష‌యం వెల్ల‌డించ‌లేదు. మీడియా క‌థ‌నాల్లో విష‌యం తెలుసుకున్న ర‌విచంద్ర‌న్ త‌ల్లిదండ్రులు ఉక్రెయిన్‌లోని ఇండియ‌న్ ఎంబ‌సీలో త‌న కుమారుడి గురించి ఆరా తీసారు. ఇంటెలిజెన్స్ అధికారులు ర‌విచంద్ర‌న్ ఇంటికి వెళ్ల‌డంతో వారు మ‌రింత ఆందోళనకు గుర‌య్యారు. అత‌నికి ఫోన్‌కాల్ చేసి, తిరిగి రావాలని అతనిని ఒప్పించేందుకు ప్రయత్నించారు. కానీ ఫ‌లితం లేక‌పోయింది.

త‌ల్లిదండ్రులు చెప్పిన వివ‌రాల‌ను బ‌ట్టి ర‌విచంద్ర‌న్ ఒక‌ప్పుడు అమెరికన్ ఆర్మీలో చేరడానికి కూడా ప్ర‌య‌త్నించాడు. చెన్నైలోని యుఎస్ కాన్సులేట్‌ను కూడా దీని గురించి సంప్రదించాడు. అది సాధ్యం కాద‌ని తెలిసిన త‌ర్వాత‌ ఏరోస్పేస్ ఇంజినీరింగ్‌లో ఐదేళ్ల కోర్సు కోసం సెప్టెంబర్ 2018లో ఖార్కివ్‌లోని యూనివ‌ర్సిటీలో చేరాడు. అక్క‌డే యూనివర్సిటీ హాస్టల్‌లో ఉంటున్నాడు. తన కుటుంబాన్నిక‌ల‌వ‌డానికి గ‌త‌ జూలై 2021లో ఇండియా వ‌చ్చాడు. ప్ర‌స్తుతం, అత‌ను ఉక్రెయిన్ పారామిలిట‌రీ బ‌ల‌గాల‌తో క‌లిసి యుద్ధంలో పాల్గొంటున్నాడు. 

Tags:    

Similar News