దారుణం.. తల్లిదండ్రుల సమక్షంలో బాలుడిని నీళ్లలో ముంచి చంపిన అత్త (వీడియో)
ఉత్తరాఖండ్ గంగా నది వద్ద అమానవీయ ఘటన జరిగింది..
దిశ, వెబ్ డెస్క్: ఆధునిక కాలంలో కూడా కొందరు మూఢనమ్మకాన్ని నమ్ముతున్నారు. రోగం నయం కావాలంటే నీళ్లలో ముంచితే చాలు తగ్గిపోతోందనుకునే మనుషులు ఇంకా ఉన్నారు. ఇలా మూఢనమ్మకానికి క్యాన్సర్ బాలుడు బలి అయ్యారు. ఇంకా కొన్నాళ్లు బతకాల్సిన బాలుడిని అత్త నీళ్లలో ముంచి చంపేసింది. ఈ అమానవీయ ఘటన ఉత్తరాఖండ్ గంగా నది వద్ద జరిగింది. ఉత్తరాఖండ్- ఢిల్లీకి చెందిన రవి కొనేళ్లుగా బ్లడ్ క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. చికిత్స పొందుతూ బాలుడు రవి అత్త వద్ద ఉంటున్నారు. అయితే క్యాన్సర్ నయంకావాలంటే గంగానది నీళ్లలో 5 నిమిషాలు ముంచాలని అత్త సుధాకు హరిద్వారాకు చెందిన తాంత్రికుడు చెప్పారు. దీంతో బాలుడిని తీసుకుని కుటుంబ సభ్యులు గంగా నది వద్దకు వెళ్లారు. బాలుడిని 5 నిమిషాల పాటు నీళ్లలోకి ముంచారు. స్థానికులు గమనించి బాలుడిని బయటకు తీశారు.
అయితే బాలుడు రవి అప్పటికే మృతి చెందారు. అయితే తన అల్లుడు రవికి క్యాన్సర్ నయం అయి లేచి నిలుచుంటాడని స్థానికులతో ఆమె వాదించారు. ఈ దృశ్యాలు స్థానిక సీసీ టీవీ ఫుటేజ్‌లో రికార్డయ్యాయి. అయితే అత్త మూఢత్వంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంకా కొన్నాళ్లుగా బతకాల్సిన బాలుడిని నీళ్లలో ముంచి కడతేర్చిదంటూ మండిపడ్డారు. ఇక విషయం తెలుసుకున్న పోలీసులు బాలుడి తల్లిదండ్రులతో సహా అత్తను అరెస్ట్ చేశారు. బాలుడి మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. కేన్సర్ తో బాధపడుతున్న బాలుడికి చికిత్స విఫలంకావడంతో తల్లిదండ్రులు, అత్త నిరాశ చెంది తాంత్రికుడి సలహా మేరకు బాలుడిని నీళ్లలో ముంచినట్లు తెలిసింది.
క్యాన్సర్ నయమవుతుందని చిన్నారిని గంగలో ముంచిన అత్త.. చిన్నారి మృతి
— Telugu Scribe (@TeluguScribe) January 25, 2024
ఉత్తరాఖండ్ - ఢిల్లీకి చెందిన రవి (5) అనే బాలుడికి బ్లడ్ క్యాన్సర్ రావడంతో గంగలో ముంచితే క్యాన్సర్ నయమవుతుందని అతని అత్త సుధా గంగలో 5 నిమిషాలు ముంచింది.. చుట్టుపక్కల వాళ్ళు గమనించి బయటకి తీస్తే అప్పటికే బాలుడు… pic.twitter.com/U1H8YXkH0P