అమృతపాల్ సింగ్ అనుచరుడి అరెస్ట్
ఖలిస్తానీ వేర్పాటువాది అమృతపాల్ సింగ్ అనుచరుడు పాపాల్ ప్రీత్ సింగ్ ను హోషియాపూర్ లో పోలీసులు అరెస్ట్ చేశారు.
దిశ, వెబ్ డెస్క్: ఖలిస్తానీ వేర్పాటువాది అమృతపాల్ సింగ్ అనుచరుడు పాపాల్ ప్రీత్ సింగ్ ను హోషియాపూర్ లో పోలీసులు అరెస్ట్ చేశారు. వారిస్ పంజాబ్ దే చీఫ్ అమృతపాల్ సింగ్ మార్చి 18న పంజాబ్ నుంచి పారిపోయిన విషయం తెలిసిందే. అమృతపాల్ సింగ్ తో పాటు ఆయన అనుచరుడు పాపాల్ సింగ్ కూడా పారిపోయాడు. అప్పటి నుంచి పంజాబ్ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఆయన కోసం గాలింపు చేపట్టారు. ఇద్దరు కలిసి పారిపోతున్న దృశ్యాలు పలు చోట్ల సీసీటీవీ ఫుటేజీల్లో లభించాయి.
ఈ క్రమంలోనే గాలింపును పోలీసులు గాలింపును ముమ్మరం చేశారు. హోషియాపూర్ లో తలదాచుకున్నాడనే సమాచారంతో పంజాబ్ పోలీసులు, పంజాబ్ కౌంటన్ ఇంటెలిజెన్స్ పోలీసులు జాయింట్ ఆపరేషన్ నిర్వహించి పాపాల్ సింగ్ ను పట్టుకున్నారు.