UPSC: పూజా ఖేడ్ కర్ వివాదం వేళ యూపీఎస్సీ కీలక నిర్ణయం

పూజా ఖేడ్ కర్ వివాదం వేళ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) కీలక నిర్ణయం తీసుకుంది. ఆరుగురు సివిల్ సర్వెంట్ల మెడికల్ సర్టిఫికేట్లను పరిశీలిస్తున్నట్లు ప్రకటించింది.

Update: 2024-08-02 09:06 GMT

దిశ, నేషనల్ బ్యూరో: పూజా ఖేడ్ కర్ వివాదం వేళ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) కీలక నిర్ణయం తీసుకుంది. ఆరుగురు సివిల్ సర్వెంట్ల మెడికల్ సర్టిఫికేట్లను పరిశీలిస్తున్నట్లు ప్రకటించింది. కొందరు ప్రొబేషనర్లు, మరికొందరు ఆఫీసర్లుగా ఉన్న వారి సర్టిఫికేట్లు స్కాన్ చేస్తున్నట్లు తెలిపింది. సివిల్ సర్వీస్ పరీక్షలో ఎంపిక కోసం చీటింగ్ మరియు ఫోర్జరీ పత్రాలను ఆరోపించిన ఐఏఎస్ మాజీ ట్రైనీ అధికారి పూజా ఖేడ్ కర్ అభ్యర్థిత్వాన్ని రద్దు చేసిన తర్వాత ఇది జరగడం గమనార్హం.

దుబాయ్ కి పారిపోయిన పూజా..!

ఐఏఎస్‌ మాజీ ట్రైనీ అధికారి పూ ఖేడ్ కర్ పరారీలో ఉన్నారు. ఆమె ఆచూకీ తెలియట్లేదు. మోసం, ఫోర్జరీ కేసులో ఆమెకు ముందస్తు బెయిల్‌ ఇచ్చేందుకు ఢిల్లీ కోర్టు గురువారం నిరాకరించింది. కోర్టు తీర్పునకు ముందే ఆమె దుబాయ్ పారిపోయినట్లు వార్తలొస్తున్నాయి. అరెస్టు భయంతోనే ఆమె దుబాయ్ పారిపోయినట్లు తెలుస్తోంది. ఒకవేళ అదే నిజమయితే.. ఢిల్లీ పోలీసులు ఆ దిశగా దర్యాప్తు చేపట్టనున్నారు. ఆమె పరారైనట్లు వస్తున్న వార్తలు నిజమైతే పూజా కోసం అంతర్జాతీయ సంస్థల సహకారం తీసుకునే ఛాన్స్ ఉంది. పూణేలో ట్రైనీ ఐఏఎస్ గా విధులు నిర్వర్తిస్తున్న టైంలో పూజా ఖేడ్ కర్ అధికార దుర్వినియోగంతో పాటు యూపీఎస్సీకి తప్పుడు అఫిడవిట్ సమర్పించారని ఆరోపణలు వచ్చాయి. ఈ కేసుపై దర్యాప్తు చేపట్టిన యూపీఎస్సీ.. జులై 30లోగా ఆమెను ముస్సోరిలోని లాల్‌బహదూర్‌ శాస్త్రి జాతీయ అకాడమీకి తిరిగి రావాలని ఆదేశించింది. ఆమె అకాడమీకి వెళ్లకపోవడమే కాకుండా.. అప్పటినుంచి పూజ ఫోన్లు స్విచ్చాఫ్‌ వస్తున్నట్లు తెలుస్తోంది. అయితే, గత రెండువారాల నుంచి పూజా ఎక్కడుందనే దానిపై ఎలాంటి సమాచారం లేదు.


Similar News