మహరాష్ట్ర విధాన సభ సమావేశాల్లో ఆసక్తికర పరిణామం..

Update: 2023-03-23 16:42 GMT

ముంబై: మహారాష్ట్ర విధాన సభ సమావేశాల్లో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ఈ సమావేశానికి వచ్చిన మహారాష్ట్ర డిప్యూటీ చీఫ్ మినిస్టర్ దేవేంద్ర ఫడ్నవిస్, శివసేన (యూబీటీ) నేత ఉద్ధవ థాక్రే ఆప్యాయంగ పలకరించుకున్నారు. విభేదాలున్నప్పటికీ మీడియా ముందు ఒకరినొకరు పలకరించుకున్నారు. మరాఠీల తరఫున పాల్గొనేందుకు ఉద్ధవ్ థాక్రే విధాన్ సభకు వచ్చారు. 2019 అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీజేపీతో పొత్తును తెంచుకున్నప్పటి నుంచి ఫడ్నవిస్, ఉద్ధవ్ ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు.

తర్వాత కాంగ్రెస్, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సీపీ)తో కలిసి థాక్రే మహా అఘాడి వికాస్ (ఎంవీఏ) ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. గతేడాది జూన్‌లో ఏక్‌నాథ్ షిండే తిరుగుబాటు చేసి థాక్రే ఎంవీఏ ప్రభుత్వాన్ని కూల్చివేసిన తర్వాత ఫడ్నవీస్, ఉద్ధవ్ మధ్య విభేదాలు మరింత తీవ్రమయ్యాయి. ముఖ్యమంతి పదవిని చేపట్టాని ఫడ్నవిస్ భావించారు. కానీ బీజేపీ మద్దతుతో ఏక్‌నాథ్ షిండే మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఫడ్నవిస్ డిప్యూటీ అయ్యారు. ఎంవీఏ ప్రభుత్వం కూలిపోయేలా చేయడం ద్వారా థాక్రేపై ప్రతీకారం తీర్చుకున్నట్లు గతంలో ఫడ్నవిస్ చెప్పారు.

Tags:    

Similar News