Kolkata rape-murder: ఓ మహిళ మరో మహిళ బాధను అర్థం చేసుకోగలదు

కోల్‌కతా మెడికో అత్యాచారం, హత్య కేసులో బీజేపీ రాజకీయాలు చేస్తోందని సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ అన్నారు.

Update: 2024-08-17 15:56 GMT

దిశ, నేషనల్ బ్యూరో: కోల్‌కతా మెడికో అత్యాచారం, హత్య కేసులో బీజేపీ రాజకీయాలు చేస్తోందని సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ అన్నారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి ఆయన మద్దతుగా నిలిచారు. "ఆమె స్వయంగా ఒక మహిళ. మరో మహిళ బాధను దీదీ అర్థం చేసుకుంటారు." అని అన్నారు. ఈకేసు విషయంలో కాషాయపార్టీపై ఆయన విరుచుకుపడ్డారు. ఈ ఘటనపై వైద్యులు నిరసనలు తెలుపుతూంటే బీజేపీ మాత్రం రాజకీయం చేస్తోందన్నారు. లక్నోలో ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ నివాసానికి సమీపంలో దళిత మహిళ ఆత్మహత్యాయత్నం కేసుని ఆయన లేవనెత్తారు. దీనిపై బీజేపీ ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. 69 వేల మంది టీచర్ల రిక్రూట్‌మెంట్ కేసులో కొత్త ఎంపిక జాబితాను సిద్ధం చేయాలని అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై అఖిలేష్ యాదవ్ మాట్లాడారు. బాధిత యువకులకు ఇప్పుడు న్యాయం జరుగుతోందన్నారు. ప్రభుత్వం చేసిన "వివక్ష" పై దిద్దుబాటు చర్యలు జరుగుతున్నాయన్నారు. యువకులకు ఇప్పుడు న్యాయం జరిగిందన్నారు.


Similar News